హైదరాబాద్

‘కాలుష్యం’తో అప్రమత్తంగా ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 2: వైద్యో నారాయణో హరి అన్నారు పెద్దలు. భగవంతుడి తర్వాత మనకు ప్రాణం పోసే అరుదైన శక్తి ఒక్క వైద్యుడికే ఉంది. అందుకే దేవుడి తర్వాత దేవుడిగా మనం వైద్యులను గౌరవిస్తాం! కానీ వ్యాధుల పట్ల ముందస్తుగా అప్రమ్తతం చేసి, వాటిని బారిన పడుకుండా మనం తీసుకోవల్సిన జాగ్రత్తలను వివరిస్తూ, మనల్ని అప్రమత్తం చేస్తూ, ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించాలని, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణాన్ని కాంక్షించే వైద్యులెంత మంది ఉంటారు? వారిని ఎంత ఉన్నతమైన హోదాతో గౌరవించుకోవాలి. అంత కాకపోయినా, సమాజశ్రేయస్సు కోసం వారు చేస్తున్న కృషిలో కనీసం భాగస్వాములమవుద్దాం!
హైదరాబాద్ మహా నగరంలో రోజురోజుకి పెరిగిపోతున్న కాలుష్యం కారణంగా నిత్యం రోడ్లపై రాకపోకలు సాగించే వాహనదారులు ఊపిరితిత్తుల సంబంధించి వ్యాధుల బారిన పడటమే గాక, ఆస్తమా వంటి వ్యాధుల నివారణకు ప్రస్తుతం మనం వాడుతున్న మందులు సైతం కాలుష్యం తీవ్రతకు పనికిరాకుండా నిర్వీర్యమవుతున్నాయాంటే కాలుష్య రక్కసి ఏ స్థాయిలో ప్రబలుతుందో అంచనా వేసుకోవచ్చు. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ గత మార్చి మాసంలో యుకెలో అధికారికంగా ప్రకటన కూడా వెలువడింది. ఊపరితిత్తుల సంబంధిత ఆస్తమా వ్యాధి బారిన పడకుండా మనం తీసుకోవల్సిన జాగ్రత్తలను వివరించటంతో పాటు వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు సమష్టిగా నడుం భిగించాయి హిమాయత్‌నగర్ అశ్విని ఎలర్జీ సెంటర్, నగర ట్రాఫిక్ పోలీసు విభాగం(సెంట్రల్ జోన్)ల సంయుక్త్ధ్వార్యంలో ‘ప్రపంచ ఆస్తమా డే’ నిర్వహించనున్నట్లు ఎలర్జీ వైద్య నిపుణుడిగా పేరుగాంచిన డా.వ్యాకరణ నాగేశ్వర్‌రావు తెలిపారు. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం ఏడున్నర గంటలకు నెక్లెస్‌రోడ్డులోని పివి ఘాట్ వద్ధ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ ఏటా ఇచ్చిన థీమ్‌తో‘బ్యానర్ ఆవిష్కరణ’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు డా.నాగేశ్వర్ తెలిపారు. ఆ తర్వాత కాలుష్యాన్ని తగ్గించుకోవటంతో పాటు మనం ఆరోగ్యం ఉండాలన్న సంకల్పంతో ‘కారు కల్చర్ తగ్గించండి- సైకిల్ వినియోగాన్ని పెంచండి’ అన్న నినాదంతో ఓ కిలోమీటరు పొడువున సైకిల్ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో వైద్యులు, ఐటి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, నర్సింగ్ సిబ్బంది పాల్గొనున్నట్లు ఆయన తెలిపారు. ఆ తర్వాత ఐమాక్స్ ధియేటర్ ఎదురుగా ఉన్న సైఫాబాద్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో 200 మంది ట్రాఫిక్ పోలీసులకు ఊపరితిత్తుల స్క్రీనింగ్ శిబిరాన్ని నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. పివిఘాట్ వద్ధ జరిగే బ్యానర్ ఆవిష్కరణ కార్యక్రమానికి సెంట్రల్ జోన్ ట్రాఫిక్ ఏసిపి మనోహర్ ముఖ్య అతిధిగా హజరుకానున్నట్లు డా. వ్యాకరణ నాగేశ్వర్ తెలిపారు.