హైదరాబాద్

సేవారత్న, కళారత్న పురస్కారాల ప్రదానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా జరుపుకునే పండుగా సంక్రాంతి అని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యుడు డా.వకుళాభరణం కృష్ణమోహన రావు అన్నారు. సంక్రాంతి సందర్భంగా వివిధ రంగాల్లో సేవలందించి వారికి ‘సేవారత్న’ పురస్కారాలతో పాటు నృత్య కళాకారులకు ‘కళారత్న’ పురస్కారాలను ప్రదానోత్సవ కార్యక్రమం ఉజ్వల సాంస్కృతిక సామాజిక సేవా సంస్థ, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం గానసభలోని కళా సుబ్బారావు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వకుళాభరణం కృష్ణమోహన రావు పాల్గొని పురస్కారాలను ప్రదానం చేశారు. తెలంగాణ ఏర్పడిన తరువాత అన్ని పండుగలు గ్రామాల్లో కూడా జరుపుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రకృతి సిద్ధంగా పండుగలు నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుందని వివరించారు. కళాకారులు కేపీవీ కుందనిక, సంగీత, సీహెచ్ సాయి కీర్తన, ప్రేక్ష, వీ.మేద ప్రదర్శించిన పలు నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వైఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు వైఎస్‌ఆర్ మూర్తి సభాధ్యక్షత వహించగా ప్రముఖ సంఖ్యాశాస్త్ర నిపుణుడు దైవజ్ఞ శర్మ, తెలంగాణ ఫోక్స్ ఆర్ట్స్ అధ్యక్షుడు వీక్కీ మాస్టర్, కురుగంటి కళాక్షేత్రం అధ్యక్షురాలు కే.రాధిక, సంస్థ అధ్యక్షురాలు ఎం.లక్ష్మీ పాల్గొన్నారు.