హైదరాబాద్

ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రజావాణిలో ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులను పరిష్కరించటంలో అధికారులు ఏమాత్రం జాప్యం చేయరాదని జిల్లా రెవెన్యూ అధికారి మదుసూధన్ రావు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశమందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి ఉపాధి, రుణాలు, ఇళ్లు, పెన్షన్లు తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించారు. రసూల్‌పురా సీబీఎన్‌నగర్‌లో ఉన్న మాతా ఎల్లమ్మతల్లి దేవాలయ అధ్యక్షుడు బీవీ వెంకట రావు.. బోనాలు పండుగ సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన సహాయం విడుదలలో జాప్యం పట్ల ఫిర్యాదు చేశారు. సానుకూలంగా డీఆర్‌ఓ స్పందించి బోనాల పండుగ నిర్వహణకు అందించిన ఆర్థిక సహాయాన్ని అర్హత మేరకు వెంటనే మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కమ్మరివాడ ముస్తాయిద్‌పురాకు చెందిన స్థానికులు మంచినీటిలో మురుగు నీరు కలస్తున్నందున ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే చర్యలు తీసుకోవాలని కోరగా, సంబంధిత విభాగం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అఫ్జల్‌గంజ్ మూసీ పరివాహక ప్రాంతంలో నివసించే రీతూబాయి తనకు రెండు ఎకరాల మూడు గుంటల భూమి ఉందని, 15 ఏళ్లుగా కరెంటు మీటర్ ఉండగా, నాలుగు నెలల క్రితం విద్యుత్ శాఖ లైన్‌మెన్ కరెంటు కనెక్షన్ కట్ చేశారని, అప్పటి నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఫిర్యాదు చేశారు. విద్యుత్ కనెక్షన్ పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డీఆర్‌ఓ మాట్లాడుతూ ప్రజావాణిలో మొత్తం ఎనిమిది ఫిర్యాదులను స్వీకరించినట్లు తెలిపారు. వాటిని వెంటనే పరిష్కరించాలని వివిధ విభాగాల వారీగా అధికారులను ఆదేవించినట్లు వెల్లడించారు. వికలాంగుల సంక్షేమ శాఖాధికారి పుష్పలత పాల్గొన్నారు.