హైదరాబాద్

మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగరంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు, మహిళలకు భద్రతను పెంచేందుకు అన్ని శాఖల సమన్వయంతో ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ వెల్లడించారు. నగరవాసులతో జీవనంతో ముడిపడి ఉన్న ముఖ్యమైన ప్రభుత్వ శాఖల అధిపతులతో జీహెచ్‌ఎంసీ శనివారం మరోసారి కన్వర్జెన్సీ సమావేశాన్ని నిర్వహించింది. కమిషనర్ లోకేశ్‌కుమార్ అధ్యక్షతన జరిగినీ సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ మహిళలు, యువతులు ఎక్కువగా సంచరించే విద్యాలయాలు, కోచింగ్ సెంటర్లు, ఎంఎన్‌సీ కంపెనీలు వంటి ప్రాంతాల్లో మహిళల భద్రతను మెరుగుపరిచేందుకు, స్నాచింగ్‌లకు తావులేకుండా ఉండేలా లైటింగ్‌ను పెంచాలని అధికారులు నిర్ణయించినట్లు తెలిపారు. ఈ సంవత్సరం రోడ్డు భద్రత, మహిళల రక్షణ కోసం అత్యంత ప్రాధాన్యతనిచ్చి, పలు కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపారు. చాంద్రాయణగుట్ట చౌరస్తా, తాజ్‌బంజారా, మల్కాజ్‌గిరి బంజారాహిల్స్ ఏరియాల్లో వాటర్ పైప్‌లైన్ల లీకేజీ కారణంగా రోడ్లు దెబ్బతింటున్నాయని, యుద్దప్రాతిపదికన లీకేజీలను శాశ్వత ప్రాతిపదికన అరికడతామని జలమండలి అధికారులు సమావేశంలో వెల్లడించారు. మెట్రోరైలు నిర్మించిన బస్ షెల్టర్లు బిజీగా ఉండే కూడళ్లకు దగ్గరగా ఉండటంతో ట్రాఫిక్ జామ్ అవుతోందని, వీటిని ట్రాఫిక్ విభాగం సూచించిన ప్రత్యామ్నాయ ప్రాంతాలకు తరలించాలని కమిషనర్ మెట్రో అధికారులకు సూచించారు. నగరంలోని మెయిన్ రోడ్లపై ప్రమాదాల నివారణ కోసం వేగ పరిమితి సూచికలను ఏర్పాటు చేసి, నిబంధనలను కఠినంగా అమలు చేయాలని కమిషనర్ సూచించారు. మెట్రోరైలు మార్గంలో సెంట్రల్ మీడియమ్స్ మధ్యలో గ్యాప్‌లను తొగలించాలని, కొంత సమయం పట్టినప్పటికీ ఫుటోవర్ బ్రిడ్జిలను వినియోగించేలా పాదచారులకు అర్థమయ్యేలా సూచికలను ఏర్పాటు చేయనున్నట్లు కమిషనర్ వెల్లడించారు. భద్రతా చర్యలు తీసుకున్నప్పటికీ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నందున 52 బ్లాక్ స్పాట్‌లలోని రోడ్లను రీ ఇంజనీరింగ్ చేసి, రోడ్ల మీడియంల రెయిలింగ్‌ను పెంచనున్నట్లు, ఈ దిశగా ఇంజనీరింగ్, ట్రాఫిక్, ట్రాన్స్‌పోర్టు అధికారులు ప్రత్యేకంగా అధ్యయనం చేయనున్నట్లు తెలిపారు. నగరంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా యాచకులను పునరావాస కేంద్రాలకు తరలించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం వీటి సామర్థ్యం వెయ్యి పడకలుంగా, అందులో 800 మాత్రమే భర్తీ అవుతున్నాయని వివరించారు. చిన్న వర్షానికే నీరు నిలిచే వాటర్ లాగింగ్ పాయింట్లను మూడు నెలల్లోసరి చేయనున్నట్లు తెలిపారు. మెహిదీపట్నం నుంచి గచ్చిబౌలీ వరకు పదికొండు కిలోమీటర్ల సర్వీసు రోడ్డును అభివృద్ది చేసేందుకు ప్రాజెక్టు నివేదికను సవరించినట్లు తెలిపారు. ఈ మార్గంలో ఫుట్‌పాత్‌లు కూడా ఆధునీకరించినున్నట్లు తెలిపారు. దిల్‌సుఖ్‌నగర్ నుంచి ఎల్‌బీనగర్ వెళ్లే మార్గంలో వెడల్పు తక్కువగా ఉన్న చోట ట్రాఫిక్ ఇబ్బందులను అరికట్టేందుకు చర్యలు చేపడుతామని కమిషనర్ వివరించారు. సీఆర్‌ఎంపీ కింద అప్పగించిన ఏరియాల్ల రోడ్ల తవ్వకానికి సంబంధించిన పనులు చేపట్టేందదుకు ఏజెన్సీలతో వివిధ శాఖలకు చెందిన అధికారులు సమన్వయం చేసుకోవాలని కమిషనర్ ఆదేశించారు. ఈ సమావేశంలో నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్, అదనపు సీపీ ఆర్‌ఎస్ చౌహాన్, అడిషనల్ సీపీలు ఆనిల్‌కుమార్, విజయకుమార్, జాయింట్ కలెక్టర్ రవి, జోనల్ కమిషనర్లు సిక్తా పట్నాయక్, చీఫ్ సిటీ ప్లానర్ దేవేందర్‌రెడ్డి చీఫ్ ఇంజనీర్ జియావుద్దిన్, మెట్రోరైలు, రెవెన్యూ, జలమండలి ట్రాఫిక్ తదితర విభాగాలకు చెందిన అధికారులున్నారు.