హైదరాబాద్

మోసం చేసి పెళ్లి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, మే 2: ఆన్‌లైన్‌లో పరిచయమై పెళ్లి చేసుకున్న మూడవ రోజే వదిలేసి వెళ్లిపోయిన వ్యక్తిని అరెస్టుచేసి చట్టప్రకారం శిక్షించాలని వరంగల్‌కు చెందిన బాధితురాలు ప్రశాంతి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. తనకు న్యాయం జరగకపోతే సిఎం క్యాంపు ఆఫీసు ముందు ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించింది. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, వివాహం నిమిత్తం తాను ఓ వైబ్‌సైట్లో తన వివరాలు పొందుపరచగా అవి చూసి యూకెలో నివాసం ఉంటున్న శ్రవణ్‌కుమార్ తనకు ఫోన్ చేశాడని తెలిపింది. ఇలా ఇద్దరి మధ్య ఏర్పడ్డ పరిచయం ప్రేమకు దారి తీసిందని, సుమారు 8 నెలల అనంతరం ఇండియాకు వచ్చిన శ్రవణ్‌కుమార్ తనను గత సంవత్సరం ఆగస్టు 6న వివాహం చేసుకున్నాడని తెలిపింది. ఎల్‌బినగర్‌లోని తన ఇంటికి తీసుకొని వెళ్లి తల్లిదండ్రులకు పరిచయం చేసి మూడు రోజులు సంసారం చేసిన అనంతరం తల్లిదండ్రులు, అన్నా, వదినల ఒత్తిడి మేరకు తనను తీవ్రంగా కొట్టి తిరిగి యూకె వెళ్లిపోయాడని నిట్టూర్చింది. ఆనాటి నుంచి న్యాయం కోసం వరంగల్ పోలీసులను, నగర పోలీసులను ఆశ్రయిస్తున్నా చులకనగా చూడటంతోపాటు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని కన్నీరు పెట్టుకుంది. తాను మోసపోయానని, తనలా మరొకరికి ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు శ్రవణ్‌కుమార్‌తో పాటు అతని తల్లిదండ్రులు, అన్నావదినలపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రికి విన్నవించింది. తనకు న్యాయం జరగని పక్షంలో సిఎం క్యాంపు కార్యాలయం ముందే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించింది.