హైదరాబాద్

యువత భాగస్వామ్యంతోనే ప్రజాస్వామ్యం మనుగడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: యువత భాగస్వామ్యంతోనే దేశంలోని ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుందని బల్దియా అదనపు కమిషనర్ (ఎన్నికలు) జయరాజ్ కెనడీ అన్నారు. ఈనెల 25న నిర్వహించనున్న జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓటు హక్కుపై ప్రతి ఒక్కరిలో అవగాహన, చైతన్యాన్ని పెంపొందించేందుకు పలు కార్యక్రమాలను చేపట్టాలనే జాతీయ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బల్దియా అధికారులు మంగళవారం నుంచి విద్యార్థులకు వివిధ అంశాల్లో పోటీలను నిర్వహిస్తున్నారు. చాదర్‌ఘాట్ విక్టరీ ప్లేగ్రౌండ్స్‌లో పలు అంశాల్లో నిర్వహించిన హైదరాబాద్ జిల్లా స్థాయి పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. అదనపు కమిషనర్ మాట్లాడుతూ 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ ఓటును నమోదు చేసుకోవాలని, రాజ్యాంగం కల్పించిన ఓటును సద్వినియోగం చేసుకుని పాలకులను ఎన్నుకోవాలని, ఎన్నుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటం మనందరి బాధ్యత అని గుర్తుచేశారు. పోటీల్లో వక్తృత్వ జూనియర్ పోటీల్లో ముగ్గురికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు ఓ కన్సోలేషన్ బహుమతిని, వ్యక్తత్వ సీనియర్ కేటగిరీ పోటీల్లో ముగ్గురు విద్యార్థులకు, వ్యాసరచన జూనియర్, సీనియర్ పోటీల విజేతలకు కూడా బహుమతులను ప్రదానం చేశారు. అన్ని అంశాల్లో వివిధ కేటగిరీల కింద మొత్తం 12 మంది విద్యార్థులకు అదనపు కమిషనర్ జయరాజ్ కెనడీ, జీహెచ్‌ఎంసీ సెక్రటరీ కిషోర్, డిప్యూటీ కమిషనర్లు విజయకృష్ణ, రమేశ్, ఇస్లావత్ సేవ బహుమతులను అందజేశారు.