హైదరాబాద్

హైదరాబాద్, కర్నాటక జట్ల శుభారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (సీఎఫ్‌ఐ) ఆథ్వర్యంలో 7వ రాజీవ్ గాంధీ ఆలిండియా టీ-20 అండర్-19 డేఅండ్‌నైట్ క్రికెట్ చాంపియన్‌షిప్ మంగళవారం అంబర్‌పేట్‌లోని వాటర్‌వర్క్స్ మైదానంలో ప్రారంభమైంది. టోర్నమెంట్ ప్రారంభోత్సవ మ్యాచ్‌లో పోటీలకు అతిధ్యమిస్తున్న హైదరాబాద్‌తో పాటు కర్నాటక జట్లు ప్రత్యర్థులపై విజయం సాధించి శుభారంభం చేశాయి. ఈనెల 21 నుంచి 24 వరకు నగంలోని వివిధ ప్లే గ్రౌండ్‌లలో నిర్వహించే చాంపియన్‌షిప్‌ను సీఎఫ్‌ఐ చైర్మన్, ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ వీ.హనుమంత రావు చాంపియన్‌షిప్ ప్రారంభించారు. నాలుగు రోజుల పాటు నగరంలోని లాల్‌బహదూర్ స్టేడియం, విజయానంద్ గ్రౌండ్ (అత్తపూర్), అంబర్‌పేట్ వాటర్ వర్క్స్ మైదానంలో మ్యాచ్‌లు జరుగుతాయి. ప్రతిష్టాత్మకమైన చాంపియన్‌షిప్‌లో భాగంగా అంబర్‌పేట్ వాటర్‌వర్క్స్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ ఆరు వికెట్ల తేడాతో బెంగుళూరుపై ఘనవిజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేపట్టిన బెంగుళూరు జట్టు, హైదరాబాద్ బౌలింగ్‌ను తట్టుకోలేక 18.9 ఓవర్లలో 67 పరుగులకు ఆలౌటైంది. జవాబుగా బ్యాటింగ్ చేపట్టిన హైదరాబాద్ కేవలం 9.3 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 68 పరుగులు చేసి విజయలక్ష్యాన్ని అధిగమించింది. మరో మ్యాచ్‌లో ఆంధ్రాపై 41 పరుగుల తేడాతో కర్నాటక గెలుపొందింది.
తొలుత బ్యాటింగ్ చేపట్టిన కర్నాటక 18 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 142 పరుగులు సాధించింది. అందుకు జవాబుగా బ్యాటింగ్ చేపట్టిన ఆంధ్రా నిర్ణీత 18 ఓవర్లలో 101 పరుగులు చేసి ఓటమి పాలైంది. ఈనెల 24వ తేదీన లాల్‌బహదూర్ స్టేడియంలో జరుగనున్న చాంపియన్‌షిప్ ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హర్యాణ మాజీ సీఎం బూపేందర్ సింగ్ హుడా విచ్చేసి గెలుపొందిన జట్లకు ట్రోఫీలను అందజేస్తారు. టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో మాజీ ఎంపీ హనుమంత రావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా యువ క్రికెటర్‌లను ప్రోత్సహించేందుకు సీఎఫ్‌ఐ కృషి చేస్తోందని చెప్పారు. కార్యక్రమంలో పాల్గొన్న చాంపియన్‌షిప్ నిర్వహణ కార్యదర్శి, టీపీసీసీ కార్యదర్శి, సీఎఫ్‌ఐ హైదరాబాద్ ఉపాధ్యక్షుడు ఎస్.శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ చాంపియన్‌షిప్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. కార్యక్రమంలో తమిళనాడు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జేఎంహెచ్ హసన్, ఉదయ్ రాజ్‌తోపాటు జ్ఞానేశ్వర్ గౌడ్, ఉదయ్ రాజ్, ఎంఏ కరీం, ప్రభాకర్ గౌడ్, రజనీకాంత్, మహేందర్ గౌడ్ పాల్గొన్నారు.