హైదరాబాద్

భక్తిశ్రద్ధలతో నగర కీర్తన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 21: సిక్కుల ఆది గురువైన గురునానక్ దేవ్‌జీ 546 జయంతి ఉత్సవాలు ‘ప్రకాశ్ ఉత్సవ్’ నగరంలోని వివిధ ప్రాంతాల్లో అత్యంత భక్తిశ్రద్దలతో ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం సికిందరాబాద్ గురుద్వారా నుంచి ప్రారంభమైన నగరకీర్తన్ ఊరేగింపు నాటరాజ్ ధియేటర్, క్లాకట్ టవర్, బాటా, కింగ్స్‌వే, మోండా మార్కెట్, ఆల్ఫా హోటల్ వరకు కొనసాగి రాత్రి తిరిగి గురుద్వారకు చేరుకుంది. ఈ ఊరేగింపులో భాగంగా సిక్కులు సాంప్రదాయ దుస్తులతో, గుర్బానీ కీర్తనలను ఆలపిస్తూ గురునానక్‌ను స్మరించారు. ముఖ్యంగా సిక్కు యువత సిక్కుల సాంప్రదాయ విన్యాసమైన గట్కా సాహహ విన్యాసాలను ప్రదర్శించి అందర్నీ ఆకట్టుకున్నారు.
వేలాది మంది సిక్కులతో కొనసాగిన ఈ ఊరేగింపు సందర్భంగా సామాన్య ట్రాఫిక్‌కు ఆటంకం కలగకుండా ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికపుడు వాహనాలను దారి మళ్లించారు.
ఈ సందర్భంగా గురుద్వారా సాహిబ్ సికిందరాబాద్ ప్రబంధక్ కమిటీ అధ్యక్షుడు ఎస్. బల్దేవ్‌సింగ్ బగ్గా, కమిటీ ఇతర ప్రతినిధులు బల్బీర్‌సింగ్ బగ్గా, ప్రదాన కార్యదర్శి ఎస్.అవతార్‌సింగ్, ఎస్. గురుదీప్ సింగ్ సాలూజలు మాట్లాడుతూ వేలాది మంది సిక్కులు పాల్గొనే గురునానక్ జయంతి ఉత్సవాల్లో ఎవరికెలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఈ నగర కీర్తన్‌లో భాగంగా అమృత్‌సర్ నుంచి విచ్చేసిన మత గురువు కల్గ్ధిర్ దశ్‌మేష్ జాత సంకీర్తనలు ఆలపించారు. సికిందరాబాద్ గురుద్వారా ఆధ్వర్యంలో ఈ నెల 24న రాత్రి ఏడున్నర గంటల నుంచి పదకొండు గంటల వరకు కీర్తన్ దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
23న అఫ్జల్‌గంజ్‌లో
గురునానక్ జయంతి ఉత్సవాలు కేవలం సికిందరాబాద్‌లోనే గాక, అఫ్జల్‌గంజ్ గురుద్వారా ఆధ్వర్యంలో కూడా ఈ నెల 23న నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు గౌలీగూడ గురుద్వారా ప్రబంధక్ కమిటీ ప్రతినిధులు తెలిపారు. 23న తేదీ సాయంత్రం అఫ్జల్‌గంజ్ నుంచి ప్రారంభం కానున్న నగరకీర్తన్ సిద్దంబర్ బజార్, జాంబాగ్, పుత్లీబౌలీల మీదుగా కొనసాగి తిరిగి గౌలీగూడ గురుద్వారా చేరుకోనున్నట్లు తెలిపారు. ఈ ఊరేగింపులో కూడా సిక్కుల మతపరమైన గట్కా సాహస విన్యాసాలను ప్రదర్శించనున్నట్లు తెలిపారు.
25న నిజాంకాలేజీ గ్రౌండ్స్‌లో విశాల్ దీవన్
గురునానక్ జయంతి ఉత్సవాల్లో భాగంగా చివరి ఘట్టంగా నిర్వహించే విశాల్ దీవన్ సామూహిక ప్రార్థనలు, సంకీర్తనాలాపన కార్యక్రమాన్ని ఈ నెల 25వ తేదీన బషీర్‌బాగ్ నిజాంకాలేజీ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా లుథియానా నుంచి భాయ్ జోగింధర్‌సింగ్‌జీ రియార్, భాయ్ సురిందర్ సింగ్‌జీ జోధ్‌పూర్, భాగ్ నాగేందర్ సింగ్‌జీ, భాయ్ హరిసింగ్ హజూరి వంటి పేరుగాంచిన రాగిజాతలతో పాటు జగ్‌దేవ్ సింగ్, భాయ్ తేజేంధర్ సింగ్‌జీ వంటి సుప్రసిద్ద రాగిజాతలు హజరుకానున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.