హైదరాబాద్

‘జన్నాభట్ల కథలు’ పుస్తకావిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: ప్రముఖ రచయిత జన్నాభట్ల నరసింహ ప్రసాద్ రచించిన ‘జన్నాభట్ల కథలు’ పుస్తకావిష్కరణ సభ సాహితీ కిరణం, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం గానసభలోని కళా సుబ్బారావు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ చారిత్రక నవలా చక్రవర్తి ఆచార్య ముదిగొండ శివ ప్రసాద్ పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. జన్నాభట్ల రచనలు మానవీయ కోణంలో ఉంటాయని పేర్కొన్నారు. జన్నాభట్ల కథలు అద్భుతంగా రచించారని తెలిపారు. సాహితీ కిరణం గౌరవ సంపాదకుడు గుదిబండి వెంకట రెడ్డి సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో విమర్శకుడు విహారి, కవి రమణ వెలమకన్ని, సాహితీ సలహాదారుడు పెద్దూరి వెంకటదాసు పాల్గొన్నారు.
28న గాయకుడు త్రినాథ రావుకు ఆత్మీయ సత్కారం
కాచిగూడ, జనవరి 22: అంతర్జాతీయ తెలుగు సంఘం 25వ వార్షికోత్సవం సందర్భంగా ప్రముఖ గాయకుడు సీహెచ్ త్రినాథ రావుకు ఆత్మీయ సత్కరం కార్యక్రమం ఈనెల 28వ తేది చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలోని కళావేంకట దీక్షితులు కళావేదికలో నిర్వహిస్తున్నట్లు సంస్థ అధ్యక్షుడు డా.కే.్ధర్మరావు, చైర్మన్ లయన్ విజయ్ కుమార్ తెలిపారు. సామాజిక మాద్యమాలలో మేలిమి సందేశాలతో కార్యక్రమా విశే్లషణతో సంస్కృతి పరంగా వివిధ ప్రదేశాలలో జరిగే కళా ప్రదర్శనలుతో పాటు తెలుగు భక్తిగీతాలను దేవాయాల్లో అలపించి ఎంతో పేరు ప్రఖ్యాతిని సంపాధించుకున్నారని తెలిపారు. మహ్మద్ రఫీ ఆధ్వర్యంలో స్థాపించబడిన తెలుగు కల్చరల్ క్లబ్‌కు ఇట్‌క్లా 2018 ఉత్తమ వాట్సాప్ మాద్యమం అవార్డును ప్రదానం చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్ విజయ బాబు, ప్రముఖ సాహితీవేత్త డా.వోలేటి పార్వతీశం, రసమయి అధినేత డా.ఎంకే రాము, గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, ప్రముఖ డైరెక్టర్ రేలంగి నరసింహా రావు పాల్గొంటారని తెలిపారు.
తెలుగు సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయాలి
కాచిగూడ, జనవరి 22: తెలుగు సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయాడానికి తనవంతు కృషి చేస్తున్నానని ప్రముఖ గాయకుడు గరికిపాటి వెంకట ప్రభాకర్ తెలిపారు. బుధవారం చిక్కడపల్లి గానసభలో మాట్లాడుతూ సంకాంత్రి సందర్భంగా సింగపూర్‌లో సంకాంత్రి సంబురాలు రెండు రోజుల పాటు సింగపూర్‌లో నిర్వహించామని వివరించారు.
భాష, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడమే ధ్యేయంగా తమ సంస్థ పని చేస్తుందని పేర్కొన్నారు. సింగపూర్‌లో సంప్రదాయ ఆటలు, ముగ్గుల పోటీలు, వంటలు, గొబ్బిళ్లు, హరిదాసు, కోలాటాలు తదితర పోటీలను నిర్వహించి వారికి తెలుగు సంప్రదాయాలను తెలియజేశామని అన్నారు. గాయకుడు గరికపాటి ప్రభాకర్ అలపించిన శాస్ర్తియ సంగీత విభావరి అలరించాయి. కార్యక్రమంలో కోఅర్డినేటర్ సిధారెడ్డి, తెలుగు సమాజం అధ్యక్షుడు కోటిరెడ్డి, కార్యదర్శి సత్యచిర్ల పాల్గొన్నారు.
అలరించిన లలిత సంగీత విభావరి
కాచిగూడ, జనవరి 22: ప్రముఖ గాయకుడు సంగీత దర్శకుడు కొమాండూరి రమాచారి జన్మదినోత్సవ సందర్భంగా లిటిల్ మ్యూజిక్ అకాడమీ శిష్య బృందం ‘లలిత సంగీత విభావరి’ దిల్లీ తెలుగు అకాడమీ ఆధ్వర్యంలో బుధవారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో నిర్వహించారు. లిటిల్ మ్యూజిక్ అకాడమీ విద్యార్థులు అలపించిన లలిత సంగీత గీతాలు అలరించాయి.