హైదరాబాద్

పోలింగ్ ప్రశాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో బుధవారం నిర్వహించిన ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయని జిల్లా కలెక్టర్ హరీష్ తెలిపారు. మూడు కార్పొరేషన్లు, 12 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగగా ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని పేర్కొన్నారు. జిల్లాలో జరిగిన ఎన్నికల నిర్వహణకు 89 మంది జోనల్ అధికారులు, 146 మంది రిటర్నింగ్ అధికారులు, 144 మంది సహాయ రిటర్నింగ్ అధికారులు, మైక్రో అబ్జర్వర్లు, భారీగా పోలీసులు విధుల్లో నిమగ్నం అయ్యారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని 105 సమస్యాత్మక కేంద్రాలు, 12 అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి ఆయా ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక బందోబస్తు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ప్రత్యేక ప్రణాళికలు, ముందస్తు చర్యల కారణంగా ఎన్నికలు సజావుగా ముగిసాయని వివరించారు. ఎన్నికల నిర్వహణకు సహకరించిన అధికారులు, స్వచ్ఛంద సంస్థలకు కలెక్టర్ హరీష్ కృతజ్ఞతలు తెలిపారు.
జిల్లాలోని 12 మున్సిపాలిటీలకు మూడు కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో 72 శాతం పోలింగ్ నమోదు అయింది. ఉదయం 7 గంటలకు ప్రారంభం అయిన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. 5 గంటలకు ముందే పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకున్న వారికి ఓటు వేసేందుకు అనుమతి ఇచ్చారు. 351 మున్సిపల్ వార్డులకు 959 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికలు ముగిసిన అనంతరం బ్యాలెట్ బ్యాక్సులను పటిష్టమైన బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్‌కు తరలించారు.
25న లెక్కింపు
మున్సిపల్ ఎన్నికల లెక్కింపు ఈనెల 25న జరగనుంది. ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు ఇక లెక్కింపుపై దృష్టి సారించారు. ఓటింగ్ పూర్తి అయిన తక్షణమే ఈవీఎంలను అధికారులు స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు. ఆదిబట్ల, తుర్కయంజాల్, ఇబ్రహీంపట్నం, అంబర్‌పేట్ మున్సిపాలిటీలకు మంగల్‌పల్లిలోని భారత్ ఇన్సిటిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ కళాశాలలో లెక్కింపు జరుగుతుంది. బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్, మీర్‌పేట్ కార్పొరేషన్, జల్‌పల్లి, తుక్కగూడ మున్సిపాలిటీలకు నాదర్గులోని ఎంవీఎస్‌ఆర్ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. బండ్లగూడ జాగిర్, శంషాబాద్, మణికొండ, నార్సింగ్ మున్సిపాలిటీలకు నాగర్‌గుల్‌లోని లార్డ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో లెక్కింపు జరుగుతుంది. షాద్‌నగర్, మున్సిపాలిటీకి సంబంధించి కౌటింగ్ గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో, షాద్‌నగర్, అమనగల్లు మున్సిపాలిటీ కౌంటింగ్ అమనగల్లు ఎంపీడీఓ కార్యాలయంలో, శంకర్‌పల్లి మున్సిపాలిటీ కౌంటింగ్ శంకర్‌పల్లిలోని మోడల్ స్కూల్‌లో నిర్వహించనున్నారు.