హైదరాబాద్

కాస్తా ముందుగానే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగర వాతావరణంలో విచిత్రమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రతిరోజు ఎండా, చలి గాలులతో జనం బేజారవుతున్నారు. కొద్దిరోజుల క్రితం వరకు పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయి, సాయంత్రం నాలుగు గంటలకే జనాన్ని గజగజ వణికించిన చలి క్రమంగా తగ్గుతోంది.
వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులు, గ్లోబల్ వార్మింగ్ వంటి కారణాలతో ఈ సారి ఎండాకాలం కాస్త ముందుగానే ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు నిపుణులు చెబుతున్నారు. కొద్దిరోజుల క్రితం వరకు నగరంలో పగటి గరిష్ట ఉష్ణోగ్రతలు 23డిగ్రీలుగా, కనిష్ట ఉష్ణోగ్రతలు 16 డిగ్రీలుగా నమోదైన సందర్భాలు సైతం ఉండగా, ఇపుడు బుధవారం నాటి పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి. గరిష్ట ఉష్ణోగ్రత 30డిగ్రీలకు పెరిగింది. సాధారణంగా ప్రతి చలికాలంలోనూ శివరాత్రి పండుగ వచ్చే వరకు చలి పంజా విసురుతోంది. శివరాత్రి ముగిసిన తర్వాత ఒక్కసారిగా ఎండలు మండి, ఉక్కపోత ప్రారంభమయ్యేదని, కానీ ఈ సారి ఇందుకు భిన్నమైన పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి.
శివరాత్రి కిముందే ఎండకాలం ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు నిపుణులు వెల్లడించారు. కొద్దిరోజుల క్రితం ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నాం మూడు గంటలకు గరిష్ట ఉష్ణోగ్రతలు 23 డిగ్రీలు నమోదు కాగా, ఇపుడు అది కాస్త 30 డిగ్రీలకు పెరిగింది. కానీ తెల్లవారుఝము ఎనిమిది, తొమ్మిది గంటల వరకు చలి తీవ్రత ఎక్కువగానే ఉంటుంది. కారణంగా వాకింగ్, జాగింగ్‌లకు వచ్చే వారి సంఖ్య పలుచగా కనబడుతోంది. పేరుగాంచి కేబీఆర్, చాచానెహ్రూ పార్కులతో పాటు ఇందిరాపార్కు, పబ్లిక్ గార్డెన్స్‌లలోనూ వాకర్ల సంఖ్య ఎనిమిది గంటల తర్వాతే క్రమంగా పెరుగుతోంది. కానీ క్రమంగా ఎండ ప్రభావం పెరుగుతున్నా, చలి ప్రభావం కేవలం అర్థరాత్రి ఒంటి గంట నుంచి ఉదయం ఏడు గంటల వరకే పరిమితమైంది. ఉదయం పది, పదకొండ గంటల నుంచి మద్యాహ్నాం మూడు గంటల వరకు ఎండ దంచికొట్టడటంతో పలు ప్రాంతాల్లోని నగరవాసులకు చెమటలు పట్టడం మొదలైంది.