హైదరాబాద్

జాబ్ మేళాకు భారీ స్పందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఉన్నత చదువులు చదివి, ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగావకాశాలను కల్పించేందుకు జిల్లా ఉపాధి శాఖ అధికారులు శనివారం మల్లేపల్లిలో నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన వచ్చినట్లు ఉపాధి అధికారి కె.లక్ష్మణ్‌కుమార్ తెలిపారు. అపోలో ఫార్మసీ, వసంత టూల్స్ క్రాఫ్ట్స్ ప్రైవేటు లిమిటెడ్, పేటీఎం, ఐడీబీఐ ఫెడరల్, నెట్ అంబిట్, ఆర్‌ఎస్ బిజినెస్, సపోర్టు సొల్యూషన్స్‌తో కలిపి మొత్తం ఆరు ప్రైవేటు కంపెనీలు ఈ మేళాల్లో పాల్గొని, తమవద్దనున్న ఖాళీలను భర్తీ చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌కుమార్ మాట్లాడుతూ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారని వివరించారు. డీఎంఆర్సీలో నమోదు చేసుకుని విదేశాల్లో గల ఉపాధి అవకాశాలను కూడా పొందవచ్చునని తెలిపారు. ఇలాంటి జాబ్ మేళాలకు హాజరై విద్యావంతులైన యువత ఉపాధి అవకాశాలను పొంది, ముందుకు సాగాలని సూచించారు. ఎన్‌ఎస్‌సీ పోర్టల్‌లో వివరాలను నమోదు చేసుకుని జాతీయ స్థాయిలో ఉన్న ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని నేషనల్ కెరీర్ సర్వీస్, యంగ్ ప్రొఫెషనల్ టి.రఘుపతి తెలిపారు. శనివారం నిర్వహించిన మేళాలో వివిధ కంపెనీల ప్రతినిధులు అభ్యర్థులకు ఇంటర్వ్యూలను నిర్వహించి జాబ్ ప్రొఫైల్ గురించి వివరించారు. 32 మందికి ఇంటర్వ్యూలను నిర్వహించగా, అందులో 13 మందికి ఎంపిక పత్రాలను రీజినల్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ లింగనాయక్ చేతుల మీదుగా అందజేశారు.