హైదరాబాద్

ఘనంగా జాతీయ ఓటరు దినోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత పరిపుష్టి చేసేందుకు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు శనివారం నగరంలో జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో జరిగిన ఈ ఓటరు దినోత్సవ వేడుకల్లో జిల్లా, రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన ఉపన్యాసం, వక్తృత్వం, వ్యాసరచన పోటీల్లో విజేతలైన వారికి గవర్నర్ తమిళి సై సౌందరరాజన్, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్, ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి, బల్దియా కమిషనర్ లోకేశ్‌కుమార్ బహుమతులను ప్రదానం చేశారు. బల్దియా కమిషనర్ మాట్లాడుతూ ఓటు హక్కు ప్రాముఖ్యత, ప్రాధాన్యతపై ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు రకరకాల కార్యక్రమాలను నిర్వహించినట్లు తెలిపారు. ఇందులో ముఖ్యంగా యువతకు అవగాహన కల్పిస్తే ప్రజాస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని భావించి, మూడురోజులుగా జిల్లా, రాష్టస్థ్రాయి పోటీలను నిర్వహించినట్లు తెలిపారు.
విజేతల వివరాలు : మూడురోజులుగా నగరంలోని చాదర్‌ఘాట్‌లోని విక్టరీ ప్లే గ్రౌండ్స్‌లో వివిధ జిల్లా నుంచి వచ్చిన విద్యార్థులకు నిర్వహించిన ఈ పోటీల్లో విజేతల వివరాలిలా ఉన్నాయి. ఉపన్యాసం సీనియర్ కేటగిరీ పోటీల్లో మొదటి బహుమతి ఎన్. ఉషశ్విని(నల్గొండ), రెండో బహుమతి ఎస్.డి. రెహ్మత్(కామారెడ్డి), తృతీయ బహుమతిని వై. నందిని(ఖమ్మం)లు అమాత్యుల చేతుల మీదుగా స్వీకరించారు. అలాగే ఉపన్యాసం జూనియర్ కేటగిరీలో పాఠశాల విద్యార్థులు పి.హనుమాన్( మహబూబాబాద్), ఓ.గౌతమి(వరంగల్ రూరల్), ఎల్.్ధరణి(కొత్తగూడెం) ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందుకున్నారు. అలాగే వ్యాసరచన సీనియర్ కేటగిరీలో డిగ్రీ కాలేజీ విద్యార్థులు ప్రథమ బహుమతి సీహెచ్ భానుప్రసాద్(మెదక్), ద్వితీయ బహుమతి యం.సాహిత్య(హైదరాబాద్) అదుకోగా, తృతీయ బహుమతిని ఎల్.హరిదాస్(ఆసిఫాబాద్) చేజిక్కించుకున్నారు. వ్యాసరచన జూనియర్ కేటగిరీలో కాలేజీ విద్యార్థులు యం.సాగరిక(మంచిర్యాల), కే.్భవానీ(సిద్ధిపేట), సీహెచ్.శ్రీయ(సిరిసిల్ల) మొదటి, రెండో, మూడో బహుమతులను స్వీకరించారు.