హైదరాబాద్

పురపోరులో కారు జోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో జరిగిన పురపాలక ఎన్నికల్లో కారు జోరందుకుంది. జిల్లాలోని ఏడు కార్పొరేషన్లు, 25 మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్ పార్టీ 23 స్థానాలను కైవసం చేసుకోగా, కాంగ్రెస్ పార్టీ 5, బీజేపీ 2, ఎంఐఎం 2 స్థానాలను దక్కించుకున్నాయి. మెజారిటీ స్థానాలను గెలుచుకొని చైర్మన్ రేసులో ఉన్న అభ్యర్థుల్లో శంకర్‌పల్లి, బోడుప్పల్, ఆదిభట్ల మున్సిపాలిటీల్లో భీకర పోరు చేసి ఓటమి పాలైనప్పటికీ అధికార పార్టీ మాత్రం దాదాపు 9 స్థానాలను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రంగారెడ్డి జిల్లాలో జల్‌పల్లి, మెడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపాలిటీలు ఎంఐఎం కైవసం చేసుకోగా ఆమన్‌గల్, తుక్కుగూడ మున్సిపాలిటీలు బీజేపీ అభ్యర్థులు అధిక సంఖ్యలో గెలిచి చైర్మన్ స్థానాలను దక్కించుకోనున్నారు. అలాగే మీర్‌పేట కార్పోరేషన్‌లో 46 స్థానాలకు గాను అత్యధికంగా 19 స్థానాలను గెలుచుకున్న టీఆర్‌ఎస్‌కు ప్రధాన ప్రత్యర్థిగా బీజేపీ నిలబడే అవకాశం ఉంది. 16 స్థానాలను గెలుచుకున్న బీజేపీ కాంగ్రెస్ పార్టీ లేదా స్వతంత్య్ర అభ్యర్థులను బుట్టలో వేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నప్పటికి సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. బడంగ్‌పేట్ కార్పోరేషన్‌లో 32 స్థానాలకు గాను 13 స్థానాలను టీఆర్‌ఎస్ కైవసం చేసుకోవడంతో 10 స్థానాలు గెలుచుకున్న బీజేపీ, 7 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీలు ఇద్దరు ఏకమై టీఆర్‌ఎస్‌కు చెక్ పెట్టాలని అంతర్గతంగా మంతనాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. మెడ్చల్ జిల్లాలో ప్రధానంగా జవహర్‌నగర్ మున్సిపాలిటీలో 28 స్థానాలకు గానూ 20 స్థానాలను కైవసం చేసుకున్న టీఆర్‌ఎస్ అంతర్గత కుమ్ములాటలతో అదే పార్టీకి చెందిన ప్రధానంగా రెండు గ్రూపులు చైర్మన్ పదవి కోసం పోటీ పడుతున్నాయి. నిజాంపేటలో 26 స్థానాలను గెలుచుకున్న టీఆర్‌ఎస్ ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులెవ్వరిని గెలవకుండా కట్టడి చేసినప్పటికి ఇక్కడ కూడా చైర్మన్ పదవి కోసం పోటీ పడుతున్నారు. రాష్ట్రంలో అత్యధిక ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన కాసాని శిరీష చైర్మన్ పదవిని ఆశిస్తున్నారు. ఈమెకు 1698 ఓట్లు పోలుకాగా ప్రధాన ప్రత్యర్థి (బీజేపీ) కేవలం 121 ఓట్లు మాత్రమే లభించడంతో రాష్ట్ర స్థాయిలో మెజారిటీ సాధించిన వారిలో స్థానం దక్కించుకున్నారు. దుండిగల్ మున్సిపాలిటీలో 17 స్థానాలతో ఎంఐఎం రేసులో ఉండగా కార్పొరేషన్లతో సహా మొత్తం 12 స్థానాలు టీఆర్‌ఎస్ కైవసం చేసుకోనుంది. మల్కాజ్‌గిరి పార్లమెంటు సభ్యులు అనుముల రేవంత్‌రెడ్డి స్వగ్రామం కొడంగల్ మున్సిపాలిటీని టీఆర్‌ఎస్ స్వీప్ చేయగా, ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని నాలుగు మున్సిపాలిటీల్లో ఇబ్రహీంపట్నం మినహా తుర్కయాంజాల్, పెద్ద అంబర్‌పేట, ఆదిభట్ల మున్సిపాలిటీల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ పోటీ లేకుండానే చైర్మన్ పదవులను దక్కించుకునేందుకు మార్గం సుగమం చేసుకుంది.