హైదరాబాద్

రెపరెపలాడిన త్రివర్ణ పతాకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికిందరాబాద్: గణతంత్ర దినోత్సవాన్ని సికిందరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు. సికిందరాబాద్ వారాసిగూడ లో బీజేపీ నేతలు బండెపల్లి సతీష్, మేకల సారంగపాణి ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు కేంద్ర హోం సహాయ మంత్రి కిషన్ రెడ్డి హజరై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని జమ్ముకాశ్మీర్‌లో కూడా అమలు చేస్తున్న ఘనత మోదీ ప్రభుత్వానికే దక్కిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
పార్సీగుట్టలో
సికిందరాబాద్ పార్శీగుట్టలోని ఎమ్పార్పీఎస్ జాతీయ కార్యాలయంలో మందకృష్ణ మాదిగ జాతీయ జండాను ఎగుర వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన వారే ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రజలంతా ప్రతిజ్ఞ పూనాలని మంద కృష్ణ కోరారు. నేతలు తిప్పారపు లక్ష్మణ్ మాదిగ, కొండూరు రాజ ఎల్లయ్య, ఎం. సామెల్, జే. లతా మాదిగ, బీ.సుజాత మాదిగ, ఎన్ విజయరావు మాదిగ, ప్రసాద్ మాదిగ, డప్పు మల్లి కార్జున మాదిగ, రాజు మాదిగ, గణేష్ మాదిగ పాల్గొన్నారు.
అడ్డగుట్టలో
సికిందరాబాద్ అడ్డగుట్ట డివిజన్ తుకారాంగేట్‌లో కాంగ్రెస్ నేతలు ఘంటా రాజు సాగర్, శాస్ర్తిల ఆధ్వర్యంలో ఘనంగా గనతంత్య్ర వేడుకలు చేశారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పండ్లపంపిణీ చేశారు. స్వాతంత్య్ర సమర యోదుల పోరాటలను స్మరించుకొన్నారు.