హైదరాబాద్

నేటి నుంచి సీనియర్ టీటీ చాంపియన్‌షిప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర టేబుల్ టెన్నిస్ సంఘం ఆధ్వర్యంలో 81వ సీనియర్ జాతీయ, అంతర్ రాష్ట్ర టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్ ఈనెల 27 నుంచి ఫిబ్రవరి 2వరకు సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తారు. ఈ చాంపియన్‌షిప్ వివరాలను టీఎస్‌టీటీఏ అధ్యక్షుడు ఎ.నర్సింహరెడ్డి అసోసియేషన్ కార్యదర్శి పీ.ప్రకాష్‌రాజ్ వెల్లడించారు. ట్యాంక్‌బండ్ బోట్స్ క్లబ్‌లో ఆదివారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ చాంపియన్‌షిప్‌లో 568 మంది క్రీడాకారులు, 200 మంది ప్రతినిధులు, సాంకేతిక నిపుణులు పాల్గొంటారని తెలిపారు. చాంపియన్‌షిప్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు అసోసయేషన్ పరంగా అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు పేర్కొన్నారు. టేబుల్ టెన్నిస్ సమాఖ్య పర్యవేక్షణలో నిర్వహిస్తున్న ఈ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే తెలంగాణ రాష్ట్ర మహళ, పురుషుల జట్టుకు వరుణి జైస్వాల్, అమాన్ బల్గు నాయకత్వం వహిస్తారు. జట్టుకు ఎంపికైన వారిలో మహిళలో జీ.ప్రణిత, రాగా నివేధిత, మనోహార్ మోనికా, శ్రీష్టిగుప్తా, పురుషులలో ఎంపికైన వారిలో అమాన్ బల్గు, ఎస్ ఫిడెల్ ఆర్ స్నేహిత్, మహ్మద్ అలీ, అమాన్ ఉర్ రేహమాన్, సరోజి సీరీల్‌లున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ స్టేట్ టేబుల్ టెన్నిస్ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.