హైదరాబాద్

అలరించిన సినీ సంగీత విభావరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: వంశీ ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో ప్రముఖ గాయనీ సజాత నిర్వహణలో ‘సినీ సంగీత’ విభావరి మంగళవారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వంశీ సంస్థల వ్యవస్థాపక అధ్యక్షుడు వంశీ రామరాజు పాల్గొని ప్రసంగించారు. 1972లో వంశీ ఆర్ట్ థియేటర్స్ ప్రారంభించినప్పటి నుంచి ఎంతో మంది కళాకారులు వంశీ సంస్థ అభివృద్ధికి దేశ విదేశాలలో సహకరిస్తూన్నారని పేర్కొన్నారు. గత 48 సంవత్సరాలుగా అనేక మంది కళాకారులు, గాయనీ, గాయకులను వంశీ సంస్థ ప్రొత్సహించిందని వివరించారు. గాయనీ సూజాత నిర్వహణలో గాయనీ, గాయకులు డా.టీవీ రావు, పవన్ కుమార్, కే.మోహన్, బైరి శ్రీనివాస్, రవి కుమార్, లలితా రావు, జ్యోతి, వాణిమాల, నీరజ, భరద్వాజ్, గంటి శైలజ పాల్గొన్నారు.
బహుగళ గాయకుడు త్రినాథ రావు
కాచిగూడ, జనవరి 28: బహుగళ గాయకుడు సీహెచ్ త్రినాథ రావు అని సమాచార హక్కు చట్టం పూర్వ కమిషనర్ పీ.విజయ బాబు అన్నారు. సమీకృత (అంతర్జాతీయ) తెలుగు సాంస్కృతిక, సారస్వత(ఇట్‌క్లా) ఆధ్వర్యంలో ప్రముఖ గాయకుడు సీహెచ్ త్రినాథ రావుకు ఆత్మీయ సత్కరం కార్యక్రమం మంగళవారం గానసభలోని కళా వేంకట దీక్షితులు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విజయ బాబు పాల్గొని గాయకుడు త్రినాథ రావుతో పాటు తెలుగు కల్చరల్ క్లబ్ సామాజిక మాధ్యమం ద్వారా ఉత్తమ వాట్సప్ గ్రూప్ అవార్డును మహ్మద్ రఫీకి పురస్కారాలను ప్రదానం చేశారు.
ప్రముఖ కవి రసమయి అధినేత డా.ఎంకే రాము సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో ప్రముఖ సినీ దర్శకుడు రేలంగి నరసింహా రావు, ప్రముఖ సాహితీవేత్త డా.వోలేటి పార్వతీశం, విజయ్ కుమార్, సాహితీవేత్త డా.జే.చెన్నయ్య, తెలుగు టీవీ రచయితల సంఘం అధ్యక్షుడు నాగబాల సురేష్ కుమార్, ఇట్‌క్లా అమెరికా కన్వీనర్ కేఎస్ మూర్తి, ఇట్‌క్లా అధ్యక్షుడు సంస్కృతి రత్న డా.కే.్ధర్మారావు పాల్గొన్నారు.
మానసిక ఉల్లాసానికి సంగీతం దోహదం
కాచిగూడ, జనవరి 28: మానసిక ఉల్లాసానికి సంగీతం దోహద పడుతుందని ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్‌పీ పట్నాయక్ అన్నారు. రవి మెలోడీస్ ఆధ్వర్యంలో మ్యూజికల్ నైట్ మంగళవారం రవీంద్ర భారతిలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పట్నాయక్ పాల్గొని ప్రసంగించారు. సంగీతం వల్ల మానసిక ఒత్తిడి దూరం అవుతుందని తెలిపారు. రవి మెలోడీస్ సంస్థ అనేక విలక్షణమైన సంగీత కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. నటుడు వెంకట ప్రసాద్, డీవీ భాస్కర్, మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచే, కేకే రాజ, సంస్థ అధ్యక్షుడు రవి కుమార్ పాల్గొన్నారు.