హైదరాబాద్

ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రోడ్డు ప్రమాదాలు అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తప్పకుండా ట్రాఫిక్ నియామాలు పాటించాలని ఫలక్‌నుమా ట్రాఫిక్ పోలీస్ ఇన్‌స్పెపెక్టర్ డీ.బాలాజీ అన్నారు. రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా చాంద్రాయణగుట్టలో మంగళవారం ఆటో, డీసీఎం డ్రైవర్లతో జరిగిన అవగాహన సదస్సుకు ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. మద్యం సేవించి వాహనాలు నడపడంతో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. వారోత్సవాల్లో భాగంగా పోలీస్టేషన్ పరిధిలో వాహనదారులకు అవగహన కల్పించేందుకు విస్తృతంగా ప్రచారం చేస్తామని వెల్లడించారు. ర్యాలీ నిర్వహించారు. ఎస్‌ఐ శేఖర్ పాల్గొన్నారు.
గచ్చిబౌలి: ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ చూడాలని రంగారెడ్డి జిల్లా ఉప రవాణా శాఖ అధికారి ప్రవీణ్ రావు పిలుపునిచ్చారు. 31వ జాతీయ రహదారి భద్రత వారోత్సవాలను పురష్కరించకుని కొండాపూర్‌లోని రవాణా శాఖ కార్యాలయంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ప్రవీణ్ రావు మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాలు జరగకుండా చూడాలని వాహనదాలను కోరారు. రవాణా శాఖ కార్యాలయానికి వచ్చిన వాహనదారులకు ఉచితంగా కంటి పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. ఎంఎస్ రెడ్డి లయన్స్ కంటి ఆసుపత్రి వైద్యుల సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కారక్రమంలో సీనియర్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ సత్యానారాయణ పాల్గొన్నారు.

ప్రత్యేక హక్కులతోనే అనాథల జీవితాల్లో వెలుగులు
- ఫోర్సు అధ్యక్షుడు గాదె ఇన్నారెడ్డి
ఖైరతాబాద్, జనవరి 28: ప్రత్యేక హక్కులతోనే అనాథల జీవితాల్లో వెలుగులు నింపగలమని ఫోర్స్ ఫర్ ఆర్పన్ రైట్స్ అండ్ కమ్యూనిటీ ఎంపవర్‌మెంట్ (్ఫర్స్) అధ్యక్షుడు గాదె ఇన్నారెడ్డి అన్నారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో అనాథల హక్కుల కోసం రూపొందించిన క్యాలెండర్‌ను ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అగ్రప్ప, రమేష్, భారతీ, యాదవ రెడ్డి, హాలీవుడ్ దర్శకుడు జగదీష్‌తో కలిసి ఆవిష్కరించారు. భారత రాజ్యాంగంలో అనాథల నిర్వచనం లేకపోవడం విచారకరమని అన్నారు. అనాథ పిల్లలను పాఠశాలల్లో చేర్చుకునేందుకు సైతం నిరాకరిస్తున్నారని చెప్పారు. ఫోర్సు ఆధ్వర్యంలో 8, 9 తేదీల్లో అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తున్నట్టు తెలిపారు.