హైదరాబాద్

దవాఖానాల విస్తరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగరంలోని పేదలకు సైతం మెరుగైన, సత్వర వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు జీహెచ్‌ఎంసీ ప్రారంభించిన బస్తీ దవాఖానాలను విస్తరించేందుకు జీహెచ్‌ఎంసీ కృషి చేస్తోంది. నగరంలోని 150 వార్డుల్లో సుమారు 350 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలని బల్దియా తొలుత భావించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వ 247 దవాఖానాల ఏర్పాటుకు ఆమోదం తెలపగా, వీటిలో 118 ప్రాంతాల్లో ఈ దవాఖానాలను ఏర్పాటు చేసి, ప్రజలకు ప్రాథమిక చికిత్సతో పాటు వివిధ రకాల వైద్య పరీక్షలను అందుబాటులోకి తెచ్చారు. వీటి పనితీరు పట్ల అన్ని వర్గాల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేయటంతో వీటిని మరింతగా విస్తరించాలని జీహెచ్‌ఎంసీ భావిస్తోంది. ఇందుకు గాను నగరంలోని సుమారు 1600 పై చిలుకు ఉన్న మురికివాడలు, బస్తీల్లోని కమ్యూనిటీ హాళ్లను గుర్తించాలని ఇప్పటికే కమిషనర్ లోకేశ్‌కుమార్ సర్కిల్ స్థాయి అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా కమ్యూనిటీ హాల్ నిర్మాణం, అందులో ఆసుపత్రి ఏర్పాటు చేసేందుకు అనుకూలమైన పరిస్థితులున్నాయా? లేదా? ఒక వేళ ఉంటే అవి ఎలా ఉపయోగపడుతాయి? లేని పక్షంలో ఎలాంటి ఏర్పాట్లు చేయాలన్న అంశాలపై నివేదికలు పంపాలని కమిషనర్ సర్కిల్ అధికారులను ఆదేశించారు. దీంతో పాటు మరో 176 కమ్యూనిటీ హాళ్లలో ఈ బస్తీ దవాఖానాలను నెలకొల్పేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినా, 58 బస్తీ దవాఖానాల్లో వైద్యుల కొరత నెలకొంది. వైద్యుల నియామకం, వారు విధులు నిర్వర్తించే వేళలు, వైద్య పరీక్షల నిమిత్తం సమకూర్చుకోనున్న వైద్య పరికరాల అంశంలో ఇప్పటికే జీహెచ్‌ఎంసీ అధికారులు పలు దఫాలుగా వైద్య శాఖ ఉన్నతాధికారులతో సంప్రదింపులు కూడా జరిపారు. ముందుగా నిర్ణయించిన 350లో 118 బస్తీ దవాఖానాల్లో సేవలను మరింత మెరుగుపర్చటంతో పాటు మిగిలిన వాటిని విస్తరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఇటీవలే బల్దియా అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.
ప్రస్తుతమున్న బస్తీ దవాఖానాలకు పేరు మార్చి స్వచ్ఛ దవాఖానాలుగా తీర్చిదిద్దిన తర్వాత ప్రజలకు ప్రతిరోజు రాత్రి కనీసం తొమ్మిది గంటల వరకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టనున్నారు. కనీసం ప్రాథమిక చికిత్స, అత్యవసర వైద్య సేవలను అందించి, ఇతర ప్రభుత్వ ఆసుపత్రులకు రిఫర్ చేసేలా యంత్రాంగం, యంత్రాలు అమల్లో ఉంచాలని బల్దియా భావిస్తోంది. ఇందుకు అవసరమైతే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద యంత్రాల సేకరణ చేపట్టాలన్న ఆలోచన కూడా లేకపోలేదు.