హైదరాబాద్

ఉద్యమ స్ఫూర్తితో ఇంకుడు గుంతల తవ్వకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 3: నీటి సంరక్షణ కోసం చేపడుతున్న ఇంకుడు గుంతల తవ్వకాల కార్యక్రమాలను ప్రతి ఒక్కరు ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకువెళ్లాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు అన్నారు. మంగళవారం కలెక్టరేటు నుండి ఎంపిడిఓలు, తహసిల్దార్లు, ఓఎస్‌డిలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 5న ప్రతి గ్రామ పంచాయతీ, అపార్ట్‌మెంట్, గేటెడ్ కమ్యూనిటీలలో ఇంకుడు గుంతలు ఉండేలా, వీలైతే బోరు పక్కనే ఏర్పాటుచేసుకునేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 500 గ్రామాలలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో మిగిలిన 188 గ్రామాలలో గ్రామ పంచాయతీ జనరల్ ఫండ్స్‌ను వినియోగించుకొని ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలన్నారు. వర్షపు నీరు వృధా కాకుండా కాపాడితే భావితరాలకు ఉపయోగపడుతుందన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో ఏడు గుంతలకు తగ్గకుండా ఇంకుడు గుంతలను ఏర్పాటుచేయాలని ఎంపిడిఓలను కలెక్టరు ఆదేశించారు. పాఠశాలలో కూడా ఇంకుడు గుంతలు ఏర్పాటుచేయాలని ఎంఇఓలను ఆదేశించారు. హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటేందుకు గ్రామాల వారీగా కార్యాచరణ ప్రణాళికలను తయారు చేయాలని ఎంపిడిఓలకు కలెక్టరు సూచించారు. ఇంకుడు గుంతల ఏర్పాటు, మంచినీటి సరఫరా, హరితహారం, ఆర్థిక మద్దతు పథకాల గ్రౌండింగ్ అంశాలపై ఎంపిడిఓలు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ ఆమ్రపాలి, సిపిఓ వైఆర్‌బి శర్మ, డ్వామా పిడి హరిత, సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు అధికారి శ్రీనివాస్, డిఇఓ రమేష్ పాల్గొన్నారు.