హైదరాబాద్

అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికింద్రాబాద్, మే 3: తెలంగాణ అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని మంత్రి పద్మారావుగౌడ్ పేర్కొన్నారు. మంగళవారం సికింద్రాబాద్ నియోజకవర్గంలోని మెట్టుగూడ డివిజన్‌లో దాదాపు కోటి రూపాయల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బంగారు తెలంగాణ నిర్మాణం కోసం తెలంగాణ ప్రజలు కోరుకున్న పాడి పంటలతో తులతూగే తెలంగాణ ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను స్వయంగా ప్రజలు తెలుసుకుంటున్నారు కాబట్టి తెరాస ప్రభుత్వ పాలనకు బ్రహ్మరధం పడుతున్నారని మంత్రి పేర్కొన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతూ వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి నిధులకు వెనుకంజవేయకుండా చర్యలు తీసుకుంటున్నా మన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంపై సిఎం కెసిఆర్ సైతం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని తెలిపారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని త్వరలో చేపట్టి నియోజకవర్గ పేదలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి కృషి చేస్తామని మంత్రి వివరించారు. అధికారులతో నిరంతర సమన్వయంతో నియోజకవర్గంలో ఎలాంటి నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోగలిగామని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. ఖర్చుకు వెనుకంజవేయకుండా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో తాము నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ భార్గవితోపాటు సరస్వతి, తెరాస సీనియర్ నాయకులు పాల్గొన్నారు.