హైదరాబాద్

మెట్రో పనులను తనిఖీ చేసిన ఉన్నతాధికారుల బృందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 3: నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం చేపట్టిన హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టు పనులు వివిధ ప్రాంతాల్లో ఉన్నతాధికారుల బృందం తనిఖీ చేసింది. మెట్రోరైలు ఎండి డా.ఎన్వీఎస్‌రెడ్డి, అదనపు పోలీసు కమిషనర్(ట్రాఫిక్) జితేందర్‌లతో కూడిన ఉన్నతాధికారుల బృందం నాంపల్లి, సికిందరాబాద్ వొఎంసి, లక్డీకాపూల్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో పనులను పరిశీలించారు. మెట్రోరైలు జరుగుతున్న ప్రాంతాల్లో ఎలాంటి సంఘటనలు చొటుచేసుకోకుండా ఉండేందుకు గాను మెట్రోరైలు, ఎల్ అండ్ టి, నగర ట్రాఫిక్ పోలీసులు సమష్టిగా భద్రతా ప్రమాణాలను చేపట్టాలని మెట్రో ఎండి అధికారులను ఆదేశించారు. మలక్‌పేట ఆర్వోబి పనుల్లో అధికారులు మరింత జాగ్రత్తతో పనులు చేపట్టాలన్నారు. ఈ పనులు జరుగుతున్న ప్రాంతాల్లో రోడ్డుకిరువైపులా కనీసం 17 అడుగల క్యారేజీ వేను కలిగి ఉండేలా బ్యారికేడ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే సికిందరాబాద్ వొఎంసి మెట్రో స్టేషన్‌లో పార్కింగ్ వ్యవస్థను స్టేషన్ ముందు భాగంలో ఏర్పాటు చేయాలని నగర పోలీసు కమిషనర్‌ను కోరునున్నట్లు మెట్రో ఎన్వీఎస్‌రెడ్డి వెల్లడించారు. అలాగే సుల్తాన్‌బజార్ సమీపంలోని పుత్లీబౌలీలో కూడా త్వరలోనే మెట్రోరైలు పనులను ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్రాంతంలో ఇదివరకే తమకు కేటాయించిన స్థలాన్ని వెంటనే తమకు అప్పగించేలా పోలీసు విభాగం కృషి చేయాలని మెట్రో ఎండి ఎన్వీఎస్ రెడ్డి కోరారు. నాంపల్లి తాజ్ ఐస్ క్రీమ్ వద్ద మిగిలి ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రాంతంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేసేందుకు మెట్రోరైలు అధికారులతో మరింత సమన్వయాన్ని సమకూర్చుకోవాలని పోలీసు అధికారులు కింద స్థాయి అధికారులకు సూచించారు. ఆ తర్వాత నాంపల్లి అసెంబ్లీ ముందు జరుగుతున్న పనులను కూడా ఉన్నతాధికారుల బృందం పరిశీలించింది. ఇక్కడ పనులను మరింత వేగవంతం చేయాలని ఎండి ఆదేశించారు. అనంతరం ఖైరతాబాద్, లక్డీకాపూల్ ప్రాంతాల్లో పనులను పరిశీలించిన అధికారుల బృందం ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ ఫౌండేషన్‌లో స్వల్పంగా మార్పులు చేయాలని సూచించారు. ఈ సందర్శనలో ఎల్ అండ్ టి మెట్రో డైరెక్టర్ ఎం.పి. నాయుడు, చీఫ్ ఇంజనీర్ మహ్మద్ జియావుద్దిన్ తదితరులున్నారు.