హైదరాబాద్

పెద్దఎత్తున మొక్కలను నాటాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా 17న జిల్లాలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పీ.సబితా ఇంద్రారెడ్డి ప్రజాప్రతినిధులకు, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి పుట్టిన రోజు సందర్భంగా జిల్లాలోని ప్రతిఒక్కరు మొక్కను నాటి హరితహారం కార్యక్రమంలో పాల్గొని సంబరాలు జరుపుకోవాలని కోరారు. ‘ఈచ్ వన్ ప్లాంట్ వన్’ అనే నినాదంతో జిల్లాలో పెద్దఎత్తున హరిత హారం కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీలోని వార్డు సభ్యులు, సర్పంచ్‌లు, మండల, జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులు, కౌన్సిలర్‌లు, కార్పొరేటర్‌లు, మున్సిపల్ చైర్మన్‌లు, కార్పొరేషన్ మేయర్‌లు, టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు విధిగా మొక్కలు నాటి వాటి సంరక్షణా బాధ్యతలను స్వీకరించాలని మంత్రి కోరారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల యందు పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలోనే అత్యధికంగా మొక్కలు నాటడం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్‌కి అపురూపమైన కానుకను అందజేస్తామని అన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలోనూ 17న పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని అన్ని విభాగాల అధికారులను ఆదేశించారు. త్వరలోనే నిర్వహించనున్న పంచాయతీ రాజ్ సమ్మేళనాల తర్వాత గ్రామాల రూపురేఖలే మారనున్నట్లు మంత్రి తెలిపారు. గ్రామాలను బాగుగా ఉంచుకునే వారికి అవార్డులు, ప్రోత్సాహకాలను అందజేస్తామని మంత్రి వెల్లడించారు.