హైదరాబాద్

సికిందరాబాద్‌లో ఏటిఎం చోరీకి విఫలయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 19: సికిందరాబాద్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు చెందిన ఏటిఎంలో ఓ దుండగుడు చోరీకి విఫల యత్నం చేశాడు. రాంగోపాల్‌పేట్ పోలీసు స్టేషన్‌కు కూతవేటు దూరంలోని ఈ బ్యాంకులో శుక్రవారం అర్ధరాత్రి ఓ దుండగుడు బ్యాంక్ భవనం పైకప్పుకు కన్నం వేశాడు. గదిలోకి దూరే యత్నంలో ముంబయిలోని ఈ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో అలారం మోగింది. సికిందరాబాద్ బ్రాంచితో ప్రధాన కార్యాలయానికి సిసి కెమెరాతోపాటు అలారం సాఫ్ట్‌వేర్ అనుసంధానం చేయడంతో అక్కడి అధికారులు అప్రమత్తమై ఇక్కడి బ్రాంచి అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు పాత నేరస్థులను పట్టుకొని విచారిస్తున్నారు.