హైదరాబాద్

పట్టణాల అభివృద్ధికి పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పట్టణ ప్రాంతాల్లో వౌలిక సదుపాయాల కల్పనకు ఎన్ని నిధులైనా వెచ్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని విద్యా శాఖ మంత్రి పీ.సబితా ఇంద్రా రెడ్డి అన్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన మున్సిపల్ మేయర్‌లు, చైర్మన్‌లు, వైస్ చైర్మన్‌లు, ఉప మేయర్‌లకు సోమవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో అవగాహన సదస్సు నిర్వహించారు. కలెక్టర్ అమోయ్ కుమార్, అడిషనల్ కలెక్టర్‌లు హరీష్, ప్రతీక్ జైన్, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అంజయ్య యాదవ్ హాజరయ్యారు. మంత్రి సబితా రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని మున్సిపాలిటీలకు ప్రతి నెలా రూ.70 కోట్లు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారని గుర్తు చేస్తూ పట్టణాల అభివృద్ధికి నిధుల కొరత ఉండబోదని అన్నారు. ఇటీవల నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమం ప్రజల భాగస్వామ్యంతో విజయవంతమైందని, ఇదే స్ఫూర్తితో పట్టణ ప్రగతి చేపట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించిన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని పూర్తిగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తమ పట్టణాలు, నగరాలలో ఉన్న సమస్యలపై పూర్తి అవగాహనను కలిగి ఉండాలని మేయర్‌లు, చైర్మన్‌లకు సూచించారు. పట్టణ పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఇందుకు అవసరమైన సిబ్బందిని నియమించేందుకు ప్రభుత్వం అనుమతిస్తుందని స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతాలను బాగుపరిచేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని జీనిలో భాగంగా ముఖ్యమంత్రి మంగళవారం మున్సిపల్ మేయర్‌లు, చైర్మన్‌లతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారని వెల్లడించారు. పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని తొలిదశలో పది రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించామని, ఈ కార్యక్రమంలో అన్ని వర్గాలను భాగస్వాములను చేసేందుకు వార్డుల వారీగా కమిటీలు వేయాలని మంత్రి ఆదేశించారు. తమ ప్రాంతాల్లో షాత్రీయ పద్దతిలో డంపింగ్ యార్డులను ఏర్పాటు చేయాలని, క్రీడా మైదానాలు, మురుగుదొడ్ల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత నివ్వాలని తెలిపారు. కాలనీ లేఔట్‌లలో ఉన్న ఖాళీ స్థలాల్లో పార్కుల నిర్మాణం, ఇతర అవసరాలకు వినియోగించాలని సూచించారు. కాలనీ ఓపెన్ స్థలాలను వెంటనే గుర్తించాలని మేయర్‌లు, చైర్మన్‌లకు సూచించారు.