హైదరాబాద్

కేంద్ర నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులను సమర్థవంతంగా వినియోగించుకొని జిల్లాను అద్బుతంగా అభివృద్ధి చేయాలని చేవెళ్ల ఎంపీ రంజిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం రాజేంద్రనగర్‌లోని సీపార్డ్‌లో ఎంపీ రంజిత్ రెడ్డి అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం జరిగింది. ఈ సమావేశానికి నాగర్‌కర్పూల్ ఎంపీ రాములు, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ అనిత, ఎమ్మెల్యేలు జయ్‌పాల్ యాదవ్, అంజయ్య యాదవ్, ప్రకాష్ గౌడ్, అరికెపుడి గాంధీ, జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, ఇతర ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశంలో జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు, సమస్యలపై సమగ్రంగా చర్చించారు. కేంద్ర ప్రభుత్వం జిల్లాల అభివృద్ధి కోసం అందిస్తున్న నిధులను పారదర్శకంగా ఖర్చు చేయాలని సూచించారు. ముఖ్యంగా ఉపాధి హామీ పథకం, మైనింగ్ ద్వారా వచ్చే నిధులను సకాలంలో వినియోగించుకోవడం ద్వారా జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ఇక రైతులకు లబ్దిచేకూర్చేందుకు ఫసల్ భీమా పథకాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ముఖ్యంగా జిల్లాలోని నిరుద్యోగ సమస్య పరిష్కారానికి యువతకు నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగ, ఉపాధి పొందేలా చూడాలని సూచించారు. గ్రామాల్లో రహదారుల అభివృద్ధిపై దృష్టి సారించి, ఆయా రోడ్లను ప్రయాణానికి అనుకూలంగా తీర్చిదిద్దాలని, ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన క్రింద అదనంగా రోడ్ల మంజూరుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని సూచించారు.
కరోనా వంటి భయంకర వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజా ఆరోగ్యంపై ప్రత్యేక ప్రణాళికలతో ముందు సాగాలని, జాతీయ ఆరోగ్య పథకం ద్వారా వచ్చే నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని ఆదేశించారు. ఉపాధి హామీ కూలీలకు వేతనాల చెల్లింపులో జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం మైనింగ్ ద్వారా జిల్లాకు రూ. 69కోట్ల ఆదాయం వస్తుందని, దీనిని రూ.85 కోట్లకు పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాబోయే ఐదేళ్లలో జిల్లాను అన్ని రంగంలో అభివృద్ధి పరిచేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఉపాధి కూలీల సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని చైర్ పర్సన్ అనిత సూచించారు. జిల్లా మినరల్ ఫండ్ మరిన్ని నిధులు వచ్చేలా చూడాలని కలెక్టర్ అమోయ్ కుమార్ కోరారు. బడి మానేసిన బాలికలను పాఠశాలల్లో చేర్పించేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని, మరుగుదొడ్లు లేకపోవడం వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్న నేపథ్యంలో ఆ సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. అంగన్ వాడీ కేంద్రల్లో సైతం గ్యాస్ పోయిలను వినియోగించేలా చూడాలని కోరారు.