హైదరాబాద్

అవార్డులతో సమాజంలో గుర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: అవార్డులతో సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని పలువురు వక్తలు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా వివిధ రంగాల్లో ప్రముఖులకు ‘దిబెస్ట్ లీడర్’ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం కళానిలయం సాంస్కృతిక సంస్థ, వీ3 న్యూస్ చానల్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య, తెలంగాణ రాష్ట్ర శాసనసభ పూర్వ సభాపతి ఎస్.మధుసూదన చారి పాల్గొని వివిధ రంగాల్లో సేవలందిస్తున్న వారికి అవార్డులను ప్రదానం చేశారు. ఇటీవల విడుదలైన ‘ ఉత్తర’ చిత్ర యూనిట్‌కు ఆత్మీయ సత్కరం చేశారు. సభకు ముందు కళాకారులు ప్రదర్శించిన పలు నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కాచం ఫౌండేషన్ అధ్యక్షుడు కాచం సత్యనారాయణ సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో సినీ దర్శకుడు సాయి వెంకట్, డా.లయన్ చిల్లా రాజశేఖర్ రెడ్డి, నృత్య గురువు డా.ఎస్‌పీ భారతి, మాజీ డీసీపీ సుంకర సత్యనారాయణ, సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు ఎం.సురేందర్, పుష్పలత పాల్గొన్నారు.