హైదరాబాద్

బ్యాడ్మింటన్‌లో తిరుగులేని శక్తిగా భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: బ్యాడ్మింటన్‌లో భారత్‌ను తిరుగులేని శక్తిగా మార్చడమే తమ లక్ష్యమని జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్, మాజీ ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్ పుల్లెల గోపిచంద్ తెలిపారు. నగరంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో అనూప్ శ్రీ్ధర్ బ్యాడ్మింటన్ అకాడమీ బెంగళూరు స్పోర్ట్స్ స్కూల్ మెంటర్‌గా వ్యవహరించేందుకు గోపిచంద్ అంగీకరించారు. గోపిచంద్ మాట్లాడుతూ భారత దేశానికి అత్యంత విలువైన రెండు ఒలింపిక్ పతకాలు తీసుకురావడంలో కీలకపాత్ర పోషించిన భారత్ యొక్క అత్యంత విజయవంతమైన బ్యాడ్మింటన్ కోచ్, వౌలిక సదుపాయాలు, పర్యావరణ వ్యవస్థతో పాటు కోచ్‌లను పెంపొందించడం ద్వారా భారతదేశాన్ని క్రీడా సూపర్ పవర్‌గా నిర్మించడంలో తన అనుభవాన్ని, నైపుణ్యన్ని ఉపయోగించుకోవాలని తెలిపారు. దేశానికి ఒలింపిక్ పతక విజేతలను తయారుచేసే స్పోర్ట్స్ స్కూల్ లక్ష్యం ప్రముఖ విద్యా సమూహం, జైన్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ సహకారంతో బలపడిందని పేర్కొన్నారు. ప్రపంచ బ్యాడ్మింటన్‌లో భారతదేశాన్ని ఆధిపత్య శక్తిగా మార్చాలనే లక్ష్యంతో స్పోర్ట్స్ స్కూల్‌లో అనూప్‌తో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందని గోపిచంద్ అన్నారు. దేశంలో యువ ప్రతిభావంతులను గుర్తించి వారికి అవకాశాలు ఇవ్వడం, చదువుతో పాటు ప్రపంచస్థాయి వసతులతో వివిధ క్రీడాంశాల్లో చాంపియన్ల పర్యవేక్షణలో శిక్షణ ఇప్పించడమే ది స్పోర్ట్స్ స్కూల్ లక్ష్యమని చెప్పారు. భారత్‌ను ప్రపంచ శక్తివంతమైన క్రీడాగా మార్చేందుకు టెన్నిస్ కోసం రోహన్ బోపన్న, ఫుట్‌బాల్ కోసం బెంగళూరు ఫుట్‌బాల్ క్లబ్, క్రికెట్ కోసం రాబిన్ ఉతప్ప సలహాదారుడిగా ఉన్న క్రికెటింగ్ ఎక్సలెన్స్‌ను ది స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేయడంతో పాటు విద్యాబోధన కోసం జైన్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ ఫర్ ఎడ్యుకేషన్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. బ్యాడ్మింటన్ అకాడమీలో బిగినర్స్, ఇంటెర్మీడియేట్, ప్రొఫెషనల్స్‌కు అనూప్ శ్రీ్ధర్ శిక్షణ ఇస్తున్నారు. బ్యాడ్మింటన్ ప్రొగ్రామ్‌కు పుల్లేల గోపిచంద్ మెంటర్‌గా ఉన్నారని ది స్పోర్ట్స్ స్కూల్ చైర్మన్ డాక్టర్ చెన్‌రాజ్ చెప్పారు. ప్రారంభం నుంచి స్పోర్ట్స్ స్కూల్ క్రీడలను, విద్యను చక్కగా సమ్మిళితం చేస్తూ, విద్యార్థులను ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల్లోనూ ది స్పోర్ట్స్ స్కూల్‌ను విస్తరించే ప్రణాళికలో ఉన్నాం అని స్కూల్ వ్యవస్థాపకులు, కల్పెన్ వెంచర్స్ డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ప్రొఫెషనల్ అథ్లెట్లకు కావాల్సిన కోచ్‌లు, ఫిజియోథెరఫిస్టులు, న్యూట్రిషియన్లతో పాటు అన్ని సదుపాయాలు ఒకే చోట కల్పించడం స్కూల్ ప్రత్యేకతలో భాగమని వివరించారు.