హైదరాబాద్

ఉత్తరాది పాలకుల అన్యాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్: ఉత్తారాది పాలకులు దక్షణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ద్రావిడనాడు ఆవేదన వ్యక్తం చేసింది. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో జాతీయ అధ్యక్షుడు కిన్నర సిద్ధార్థ మాట్లాడారు. స్వాతంత్య్రం సిద్ధించిన నాటి నుంచి ధీల్లీ పీఠాన్ని కైవసం చేసుకుంటున్న ఉత్తారాది రాష్ట్రాలు దక్షణ ప్రాంతాలపై తీవ్ర వివక్షను ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. దేశానికి ఆర్థిక వనరులు సమకూర్చడంలో కీలకంగా వ్యవహరిస్తున్న దక్షణాది రాష్ట్రాలకు రావాల్సిన కేంద్ర నిధులను ఇవ్వకుండా అడ్డుపడుతున్నారని అన్నారు. హైదరాబాద్‌లో ఫార్మాసిటీ ఏర్పాటుకు రూ.16వేల కోట్లు, వౌలిక వసతుల ఏర్పాటుకు ఆరువేల కోట్లు రూపాయలు కేటాయించాల్సి ఉండగా ఇవ్వడం లేదని అన్నారు. వీటన్నింటి నేపథ్యంలో ప్రత్యేక ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నట్టు చెప్పారు. ఈ ఉద్యమంలో భాగంగా మార్చి 31న హైదరాబాద్ నగరంలో ధర్నా చేసి, అనంతరం దేశ రాజధానిలో భారీ ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో శంకర్, బాల్‌రెడ్డి, వెంకటేష్, ఫయాజ్, స్వామి, యాదగిరి పాల్గొన్నారు.