హైదరాబాద్

శివార్లలో కొత్త రోడ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగరంలో నిత్యం రద్దీగా ఉండే మెయిన్‌రోడ్లపై రోజురోజుకి పెరుగుతున్న వాహనాల రద్దీకి అనుకూలంగా ప్రత్యామ్నాయంగా రోడ్లు వేసేందుకు బల్దియా సిద్ధమైంది. ముఖ్యంగా శివారులోని పనె్నండు మున్సిపాల్టీలో గ్రేటర్‌లో విలీనం చేసి సుమారు 13 ఏళ్లు గడుస్తున్నా, వాటిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయలేకపోయారు. జాతీయ రహదారులను ఆనుకుని ఉన్న మెయిన్ రోడ్లపై రద్దీని తగ్గించేందుకు వీలుగా శివార్లలో కొత్తగా 291.28 కిలోమీటర్ల పొడువున గుర్తించిన గ్రావెల్ రోడ్లను సీసీ రోడ్లుగా నిర్మించేందుకు జీహెచ్‌ఎంసీ రూ. 170కోట్ల 72లక్షలను మంజూరు చేసినట్లు కమిషనర్ లోకేశ్‌కుమార్ బుధవారం వెల్లడించారు. వాహనాల రద్దీ ఎక్కువగా ఉండి, తరుచూ ట్రాఫిక్ జాం కావటం, చిన్న చిన్న మలుపులుండటం, జాతీయ రహదారులు, మెయిన్‌రోడ్లకు అప్రోచ్ రోడ్లుగా వినియోగిస్తున్న చిన్న రోడ్లను గ్రావెల్ రోడ్లుగా గుర్తించారు. ఈ రోడ్ల పనులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అన్ని పనులు నిర్ణీత గడువులోపు పూర్తయ్యేలా ఎప్పటికపుడు నిరంతర పర్యవేక్షణ ఉండాలని కమిషనర్ బుధవారం జరిగిన అదనపు, జోనల్ కమిషనర్ల సమావేశంలో సూచించారు. కొత్తగా ప్రతిపాదించిన 291.28కిలోమీటర్ల కొత్త రోడ్లలో ఎక్కడైనా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, నీటి సరఫరా చేసే వ్యవస్థలుంటే వాటిని సకాలంలో మరో చోటకు మార్చి పనులను చేపట్టాలని ఆదేశించారు.