హైదరాబాద్

సీఆర్‌ఎంపీ పట్టదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగర పాలక సంస్థ అధికారులు ఏ పని చేపట్టినా చిత్తశుద్ధి, ముందుచూపు కొరవడిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే నగరంలో నిత్యం రద్దీగా ఉండే పలు రహదారులు పూర్తిగా గుంతలమయమై వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే! ఇందుకు నగరంలోని వీఐపీజోన్‌లోని అతి ముఖ్యమైన లక్డీకాపూల్ ప్రాంతంలోని రోడ్లే సాక్ష్యాలు. నగరంలోని 709 కిలోమీటర్ల రోడ్డు నిర్వాహణ పనులను మూడు నెలల క్రితం ప్రైవేటు సంస్థలకు అప్పగించిన సంగతి తెలిసిందే! కొత్త నిర్మాణం, రోడ్ల రీ కార్పెటింగ్, మరమ్మతులు అంటూ ప్రతి సంవత్సరం బల్దియా అధికారులు వందలాది కోట్లను ఖర్చు పెడుతున్నా, రోడ్ల పరిస్థితి ఏ మాత్రం బాగుపడకపోవటంతో నిర్వాహణ బాధ్యతలను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తే పనుల్లో నాణ్యత, జవాబుదారితనం పెరుగుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమైనా, రోడ్ల నిర్వాహణను ప్రైవేటుపరం చేసింది నిధులు దారి మళ్లించేందుకేనన్న ఆరోపణలు సైతం విన్పించాయి. ఇందుకు సమగ్ర రోడ్ల నిర్వాహణ ప్రాజెక్టు(సీఆర్‌ఎంపీ) కార్యక్రమాన్ని రూపకల్పన చేసి, ఆరు జోన్‌లకు రూ.1500 కోట్లను కేటాయిస్తూ, 709 రోడ్లను పలు ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించారు. నెలలు గడుస్తున్నా, నేటికీ కనీసం ఏ రోడ్డు ఏ సంస్థకు కేటాయించారు? ఏ రోడ్డును ఏ సంస్థ మెయింటనెన్స్ చేస్తుంది అన్న కనీస సమాచార బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదు.
నగరంలోని మొత్తం 3వేల బీటీ, మరో ఆరువేల కిలోమీటర్ల సీసీ రోడ్లుండగా, ఇందులో కొన్ని రోడ్లను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తే జీహెచ్‌ఎంసీపై మెయింటనెన్స్ భారం కూడా తగ్గుతుందని భావించగా, ఆ కార్యక్రమానికి ఆదిలోనే అడ్డంకులేర్పడ్డాయి. రోడ్లను అప్పగించి నెలలు గడుస్తున్నా, ఏ ఒక్క ఎజెన్సీ కూడా మరమ్మతులు చేపట్టకపోగా, కనీసం ఈ రోడ్డు మెయింటనెన్స్ తాము చేపడుతున్నామన్న వివరాలతో బోర్డులను కూడా ఏర్పాటు చేయకపోవటం జీహెచ్‌ఎంసీ అధికారుల క్షేత్ర స్థాయి విధి నిర్వాహణకు నిదర్శనంగా పేర్కొనవచ్చు. పైగా మొత్తం 709 కిలోమీటర్ల రోడ్లలో ఏ రోడ్డును ఏ ఏజెన్సీకి కేటాయించారన్న సమాచారాన్ని కూడా అధికారులు గోప్యంగా ఉంచటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ క్రమంలో ఇటీవలే బల్దియా ప్రధాన కార్యాలయంలో పలు పనులపై సమీక్ష నిర్వహించిన మంత్రి కే. తారాకరామారావు సీఆర్‌ఎండీ విషయాన్ని ప్రస్తావిస్తూ ఎక్కడా కూడా పనులు ప్రారంభం కాకపోవటంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, అమలు చేయటం మీ వల్ల సాధ్యం కాకపోతే ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాలని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఇప్పటికే పలు అంశాల్లో వరుసగా మంత్రి కేటీఆర్ చురకలు పెట్టినా, బల్దియా అధికారుల పనితీరులో ఏ మాత్రం మార్పు రాకపోవటం గమనార్హం.