హైదరాబాద్

బాధిత కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఇటీవల వర్షాలు బాగా కురిసినపుడు బోరబండలోని నాలాలో పడి మృతిచెందిన రామారావు బాధిత కుటుంబానికి జీహెచ్‌ఎంసీ ఎక్స్‌గ్రేషియాను అందజేసింది. మృతుడు జొన్నగడ్డల రాజయ్య భార్య జొన్నగడ్డల ఎల్లవ్వకు డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్ రూ.2లక్షల చెక్కును గురువారం తన ఛాంబర్‌లో అందజేశారు. ప్రమాదాలు, కాలవైపరీత్యాలు జరిగినపుడు ప్రమాదవశాత్తు చనిపోయే మృతుల బాధిత కుటుంబాలకు జీహెచ్‌ఎంసీ తనవంతు బాధ్యతగా ఆర్థికంగా ఆదుకునేందుకు చెల్లించే ఎక్స్‌గ్రేషియాను ఇటీవలే పెంచిన విషయాన్ని బాబా ఫసియుద్దిన్ గుర్తుచేశారు. మేయర్ బొంతు రామ్మోహన్ సిఫార్సు మేరకు మేయర్ విచక్షణ నిధి నుంచి ఈ ఎక్స్‌గ్రేషియాను అందజేసినట్లు తెలిపారు.
విద్యార్థుల సృజనాత్మకతను
వెలికితీయడానికే వైజ్ఞానిక ప్రదర్శనలు

హైదరాబాద్, ఫిబ్రవరి 27: విద్యార్థుల సృజనాత్మకతను వెలికితియడానికి వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతో దోహదపడుతాయని బహదూర్‌పుర మండల ఉప విద్యాశాఖాధికారి వేణుగోపాలాచారి అన్నారు. సైన్స్‌డేలో భాగంగా వైజ్ఞానిక ప్రదర్శనను పాతబస్తీ సుల్తాన్‌షాహి - గౌలిపురలోని షాలిబండ ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో టీచర్ల పర్యవేక్షణలో విద్యార్థులు వైజ్ఞానిక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పాఠశాల ఇన్‌చార్జి మైత్రి, ఉపాథ్యాయులు రామసుబ్బా రావు, సాయిబాబా, వాణి విజయలక్ష్మి, పీఈటీ రాధికా రెడ్డి, డాక్టర్ శ్రీవాటి శ్రీనాథ్ పాల్గొన్నారు.