హైదరాబాద్

సమ్మెకు సన్నద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 4: జంటనగరాల్లో పారిశుద్ధ్య పనులను రాంకీ సంస్థకు అప్పగించేందుకు జిహెచ్‌ఎంసి అధికారులు రహస్యంగా చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు కార్మిక సంఘాలు సన్నద్దమవుతున్నాయి. ఇప్పటి వరకు ఎవరి లబ్ది కోసం వారు వేర్వేరు కుంపటిలుగా విడిపోయిన కార్మిక సంఘాలన్నీ కూడా రాంకీ ఒప్పందాన్ని వ్యతిరేకించేందుకు ఒక గొడుగు కిందకు వచ్చే దిశగా ప్రయత్నాలు మొదలైనట్లు సమాచారం. నగరంలో ఇంటింటి నుంచి చెత్తను సేకరించి, దాన్ని ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌కు, అక్కడి నుంచి డంపింగ్‌యార్డుకు తరలించేందుకు ఇదివరకు ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక విభాగముండేది. ఓ ప్లాన్ ప్రకారం ఆ విభాగాన్ని వికేంద్రీకరణ చేసి, ఆ తర్వాత ఆశించిన సమయంలో చెత్తను చెత్త కుండీల నుంచి ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌కు, అక్కడి నుంచి డంపింగ్ యార్డుకు తరలించలేకపోతున్నామని, అందుకే ప్రజారోగ్య పరిరక్షణ ఈ రకమైన విధులను శాస్ర్తియంగా నిర్వహంచే రాంకీ ఎన్విరో సంస్థకు బాధ్యతలను అప్పగిస్తున్నామని ప్రకటించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారని పలు యూనియన్ల నేతలు ఆరోపిస్తున్నారు. ఏ రోజైతే అధికారులు ప్రకటన చేస్తారో, అప్పటి నుంచే అధికారుల నిర్ణయానికి, రాంకీ ఒప్పందానికి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభమవుతుందని అధికార తెరాస పార్టీకి చెందిన పలువురు నేతలే తేల్చి చెబుతున్నారు. 2009లో రాష్ట్రంలో సమైక్య పాలన కొనసాగుతున్న సమయంలోనే తాము ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన నేపథ్యంలో అప్పటి ప్రభుత్వం అమలు చేయకుండా పక్కనబెట్టిన రాంకీ ఒప్పందాన్ని తెరాస ప్రభుత్వం అమలు చేయటాన్ని వారు తప్పుబడుతున్నారు. చెత్త సేకరణ, తరలింపు విధులు, చెత్త వాహనాల డ్రైవర్లు, మెకానిక్‌లతో కలిపి మొత్తం వేలాది మంది పర్మినెంటు, ఔట్‌సోర్సు, కాంట్రాక్టు కార్మికులు ఆధారపడి జీవిస్తున్నారని, ఇపుడు రాంకీకి అప్పగిస్తే వారు బతుకులు రోడ్డున పడే ప్రమాదం ఉండటంతో కార్మికుల శ్రేయస్సు కోసం తాము రాంకీకి వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నామని పలు యూనియన్ల నేతలు తెలిపారు.