హైదరాబాద్

కోవిడ్-19 నివారణకు పటిష్టమైన చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న కోవిడ్ -19 నివారణకు జిల్లా వ్యాప్తంగా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సీపీ సజ్జనార్‌తో కలిసి మాట్లాడారు. కోవిడ్‌ను నిలువరింప చేసేందుకు జిల్లాలో 48 ప్రత్యేక బృందలను సిద్దం చేసినట్టు చెప్పారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఎల్బీనగర్, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో సేవలు అందించేందుకు మరో ఐదు బృందాలను రంగంలోకి దింపినట్టు చెప్పారు. విదేశాల నుంచి వచ్చిన 628 మందిని గుర్తించినట్టు తెలిపారు. వీరి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి పూర్తి ఆరోగ్యంగా ఉన్న సరే 14 రోజుల పాటు స్వియ నిర్బందంలో ఉండాలని సూచించినట్టు చెప్పారు. లక్షణాలు కలిగిన వారిని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్వారెంటైన్ కేంద్రాలకు తరలించి మెరుగైన చికిత్సలు అందిస్తున్నట్టు తెలిపారు. కోవిడ్ వ్యాధి ఒకరి నుంచి ఒకరి అతివేగంగా సోకే వ్యాధి కనుక సామాజిక దూరం పాటించాలని, ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చిన వారు వారి ఆరోగ్యంతో పాటు ఇతరుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సామాజిక బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. శనివారం నుంచి విదేశాల నుంచి వచ్చే వారికి ప్రత్యేక స్టాపింగ్ వేస్తున్నట్టు వారు తమకు తాముగా 14 రోజుల పాటు స్వియ నిర్బందంలో ఉంటామని సెల్ఫ్ డిక్లరేషన్‌ను తీసుకుంటున్నట్టు చెప్పారు. ఇలా డిక్లెరేషన్ ఇచ్చి నిబందనలకు విరుద్ధంగా బహిరంగ ప్రదేశాల్లో తిరిగితే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. విదేశాల నుంచి వచ్చి బహిరంగ ప్రదేశాల్లో తిరిగుతున్నట్టు ఎవరైనా గురిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఇలాంటి వారిపై ఐపీ సీ 269, 270, ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ 1897 క్రింద క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సీపీ సజ్జనార్ హెచ్చరించారు. ఇక జిల్లాలోని 357 మున్సిపల్ వార్డులు, 560 గ్రామ పంచాయితీల్లో కరోనాపై ప్రత్యేక బృందాల చైతన్య కార్యక్రమాలను చేపడుతున్నట్టు తెలిపారు. దేవాలయాలు, ప్రార్థన మందిరాల వద్ద భక్తులకు ప్రవేశం లేదంటూ సూచిక బోర్డులను సైతం ఏర్పాటు చేసి సహకరిస్తున్నారని చెప్పారు. కోవిడ్ వ్యాప్తి అరికట్టేందుకు దేశ ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో జనతా కర్ఫ్యూ విజయవంతానికి పూర్తి సన్నద్దంగా ఉన్నట్టు కలెక్టర్ అమోయ్ కుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లాలో 24 గంటల పాటు జనతా కర్ఫ్యూ కొనసాగుతుంది స్పష్టం చేశారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు ఇది కొనసాగుతుందని చెప్పారు. ఉదయం 5:30 గంటలకు ప్రత్యేక బృందాలు సైరన్ మోగించడంతో కర్ఫ్యూ ప్రారంభం అవుతుందని తెలిపారు. ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు కల్లోల పరుస్తున్న కరోనను వైద్య బృందాల సేవలకు ధన్యవాదాలు చెబుతూ ప్రజలు ఇండ్ల ముందుకు వచ్చి చపట్ల ద్వారా ధన్యవాదాలు తెలపాలని సూచించారు.