హైదరాబాద్

జనతా కర్ఫ్యూకు రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కోవిడ్-19 వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం జనతా కర్ఫ్యూకు జనం సిద్ధ్దమవుతున్నారు. ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు 12 గంటల పాటు జనం తామంతట తాము కర్ఫ్యూను పాటించాలని కేంద్ర ప్రభుత్వం సూచించగా, రాష్ట్ర సీఎం కేసీఆర్ మాత్రం ఇరవై నాలుగు గంటలు అంటే సోమవారం ఉదయం ఆరు గంటల వరకు కర్ఫ్యూలో జనం పాల్గొని, కోవిడ్ వైరస్ ఉన్న ప్రాంతాలకు వెళ్లకుండా ఇంట్లోనే గడపాలని పిలుపునిచ్చారు. అత్యవసర సేవలు మినహా మిగిలిన అన్ని రకాల వ్యాపారాలు, సంస్థలు అన్నీ బంద్ ఉంటాయని ప్రకటించటంతో ఇరవై నాలుగు గంటల పాటు కర్ఫ్యూ పాటించేందుకు మహానగరవాసులు సానుకూలంగా స్పందించారు. ఇరవై నాలుగు గంటల పాటు ఇంట్లోనే గడిపేందుకు అవసరమైన సరుకులను కొనుగోలు చేసేందుకు శనివారం జనం ఎగబడ్డారు. నగరంలోని పలు సూపర్ మార్కెట్ల వద్ద జనం క్యూ కట్టారు. ముఖ్యంగా బియ్యం, పుప్పులు, కూరగాయలు, పాలు, వంట నూనె వంటివి ఎక్కువగా కొనుగోలు చేశారు. మరికొందరు ఎంతో ముందు చూపుతో నెలరోజులకు సరిపడేలా నిత్యావసర వస్తువులను సమకూర్చుకున్నారు. భయంకరమైన కరోనా వైరస్ సోకకుండా ముందుజాగ్రత్త చర్యగా వైద్యులు చెప్పినట్టు ఎప్పటికపుడు చేతులను శుభ్రంగా కడుక్కునేందుకు వీలుగా హ్యండ్ వాష్‌లు, హ్యాండ్ శానిటైజర్‌లకు గిరాకీ పెరిగింది. సందేట్లో సడేమియా అన్నట్టు పనిలో పనిగా కొందరు నకిలీ శానిటైజర్లు, హ్యాండ్ వాష్‌లను విక్రయిస్తున్నారు. ఆదివారం నగరంలోని వివిధ ప్రాంతాల్లో ప్రతిరోజు మాదిరిగానే పాల విక్రయాలు కొనసాగనున్నాయి. ఇక అత్యవసర సేవల కింద మెడికల్ షాపులు, 104, 108 అంబుల్సెలను కూడా అందుబాటులో ఉంచనున్నారు.