హైదరాబాద్

అధికారులు బాధ్యతా యుతంగా పనిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 5: అధికారులు బాధ్యతా యుతంగా వ్యవహరించి వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని జలమండలి ఎండి డిఎస్ లోకేష్‌కుమార్ అన్నారు. ఎండిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మొట్టమొదటిసారి జలమండలి డైరెక్టర్లు, సిజిఎం స్థాయి ఉన్నతాధికారులతో ఖైర్‌తాబాద్‌లోని జలమండలి కార్యాలయంలో సమావేశమై వివిధ అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రధానంగా నీటి సరఫరా, డ్రేనేజీ వ్యవస్థ, ఎయిర్‌టెక్ మిషన్‌ల పనితీరు, మొక్కలు నాటే కార్యక్రమంతో పాటు పలు అంశాలపై ఎండి అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో నీటి, డ్రైనేజీ సమస్యలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎండి సూచించారు. నీటి సమస్యలు రాకుండా అధికారులు ఎప్పటికపుడు సమీక్షించి తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో బోర్డు ఇడి ఎం.సత్యనారాయణ, డైరెక్టర్లు జి.రామేశ్వరరావు, ఎ.కృష్ణ, శ్రీ్ధర్‌బాబు, ఎం.కొండారెడ్డి, సత్యసూర్యనారాయణలతో పాటు పలువురు సిజిఎంలు పాల్గొన్నారు.