హైదరాబాద్

విద్యాదాత మోహన్‌బాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 5: అన్ని దానాలకంటే విద్యాదానం గొప్పది. పేదల కోసం కళాశాల నిర్మించి విద్యాదానం చేస్తున్న నిర్మాత, నటుడు మోహన్‌బాబు నిజంగా కలెక్షన్ కింగ్ అని ఏపి విద్యాశాఖ మంత్రి ఘంటా శ్రీనివాస్ అన్నారు. గురువారం సాయంత్రం మోహన్‌బాబుకు దాసరి స్వర్ణకంకణ ప్రదానోత్సవంలో ఘంటా పాల్గొన్నారు. తొలుత టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ, దేశంలో ఎంతోమంది దర్శకులున్నా నటుడు, నిర్మాత, దర్శకుడు దాసరి ఒక్కరే అన్నారు. మోహన్‌బాబుకు స్వర్ణకంకణ ప్రదానం నిజంగా గురుశిష్యుల అనుబంధానికి ప్రతీక అన్నారు. హిందీనటుడు శత్రుఘ్నసిన్హా మాట్లాడుతూ, తెలుగులో ఎన్టీఆర్ అగ్రగణ్యుడని, ఆ కోవలో మోహన్‌బాబు వస్తారని అన్నారు. దాసరి మాట్లాడుతూ, ద్రోణాచార్యుడికి ఎంతమంది శిష్యులున్నా అర్జునుడు ఒక్కడే. అలాగే దాసరికి మోహన్‌బాబు ఒక్కడే అన్నారు. రాజకీయాల్లోకి రాగానే చాలామంది స్నేహం మరిచిపోతారు కానీ మరువనివాడు శత్రుఘ్న సిన్హా, మోహన్‌బాబు అని అన్నారు. నటుడు, నిర్మాత ఆర్.నారాయణమూర్తి పాల్గొన్నారు.
‘శృతిలయ- దర్శకరత్న’
స్వర్ణకంకణం ప్రదానం
చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుని దర్శక, నిర్మాతగా పరిమళభరిత రసపుష్పమై అశేష ప్రజల ఆదరాభిమానాలు పొందిన దర్శకరత్న డా. దాసరి నారాయణరావు 72వ జన్మదినోత్సవం సందర్భంగా శృతిలయ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో గురువారం రవీంద్రభారతిలో కలెక్షన్‌కింగ్, నిర్మాత, నటుడు మోహన్‌బాబుకు ‘శృతిలయ- దర్శకరత్న’ స్వర్ణకంకణాన్ని ప్రదానం చేసారు. సన్మానోత్సవంలో హిందీ నటుడు శత్రుఘ్నసిన్హా, బి.మురళి, తిరుమల బ్యాంకు చైర్మన్ చంద్రశేఖర్, ఎం.హరికిషన్, డా. భీమ్‌రెడ్డి, డా. కె.్ధర్మారావు, జెబిరాజు పాల్గొన్నారు. తొలుత హిమాన్షుచౌదరి కూచిపూడి నృత్యం ప్రదర్శించగా, ఆమని, ప్రవీణ్‌కుమార్ తమ గానంతో అలరించారు. 24 గంటలపాటు నిర్విరామ సంగీతాన్ని ప్రదర్శించిన ఎకె అయ్యంగార్‌ను సత్కరించారు.