హైదరాబాద్

చెరువుల సుందరీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సరూర్‌నగర్, మే 8: తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం చెరువుల్ని సంరక్షించుకుంటున్నామని ఇరిగేషన్ శాఖ మంత్రి టి.హరీష్‌రావు అన్నారు. ఆదివారం మీర్‌పేట్ మంత్రాల చెరువు సుందరీకరణ పనులకు మంత్రి హరీష్‌రావు ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డితో కలసి శంకుస్థాపన చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ మంత్రాల చెరువు సుందరీకరణ పనులకు రూ. 1.40 కోట్లు మంజూరు చేసినట్టు తెలిపారు. అదేవిధంగా ఎమ్మెల్యే తీగల విజ్ఞప్తి మేరకు మీర్‌పేట్ పరిధిలోని పెద్దచెరువు, సంధ్య చెరువుల సుందరీకరణకు రెండు కోట్ల చొప్పున రూ. 4కోట్లు కేటాయిస్తానని, అందుకు అధికారులు ప్రతిపాదనలు పంపాలని సూచించారు. చెరువు సుందరీకరణలో భాగంగా వాకింగ్ ట్రాక్‌తో పాటు మూడు మీటర్లు ఉన్న కట్ట వెడల్పును ఏడుమీటర్లకు పెంచుతామని ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపి కొండా విశే్వశరరెడ్డి, ఎమ్మెల్సీ పట్నం నరేందర్‌రెడ్డి, జడ్‌పిటిసి జిల్లెల నరేందర్‌రెడ్డి, కార్పొరేటర్లు అనితా దయాకర్‌రెడ్డి, పద్మా నాయక్ పాల్గొన్నారు.