హైదరాబాద్

భూగర్భ జలాల పరిరక్షణకు కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముషీరాబాద్, మే 8: భూగర్భ జలాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఆదివారం ముషీరాబాద్ మున్సిపల్ డివిజన్‌లోని పలు ప్రాంతాలలో దాదాపు రూ.10 లక్షల వ్యయంతో నిర్మించ తలపెట్టిన మంచినీటి, డ్రైనేజి పైప్‌లైన్‌ల నిర్మాణపు పనులను స్థానిక ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు డాక్టర్.కె.లక్ష్మణ్, ముషీరాబాద్ డివిజన్ కార్పొరేటర్ ఎడ్ల భాగ్యలక్ష్మి హరిబాబు యాదవ్‌తో కలిసి ప్రారంబించారు. నాయిని మాట్లాడుతూ అంతరించిపోతున్న భూగర్భజలాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటు పడాలని కోరారు. ఇంకుడు గుంతు ఏర్పాటు ఒక యజ్ఞంలా చేపట్టాలని పిలుపునిచ్చారు. లక్ష్మణ్ మాట్లాడుతూ దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రాముఖ్యత ఇస్తున్నట్లు చెప్పారు. ఇటీవల వర్షం కారణంగా ఇళ్లలోకి నీళ్లు వచ్చి నష్టపోయిన పలువు బాదితులకు కార్పొరేటర్ బియ్యాన్ని పంపిణీ చేశారు. కార్యక్రమంలో జలమండలి మేనేజర్ ఇందిరాశీలారాణి, టిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు ఎడ్ల హరిబాబు యాదవ్, ముషీరాబాద్ డివిజన్ టిఆర్‌ఎస్ ఆద్యక్ష్య, కార్యదర్శులు బిక్షపతి యాదవ్, ఎడ్ల వరుణ్, నాయకులు బాబురావు, కేబుల్ రవి, ఎయిర్‌టెల్ రాజు, మహేష్ గౌడ్ పాల్గొన్నారు.
అవగాహన కల్పించాలి
ఘట్‌కేసర్: ఇంకుడు గుంతల ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ చైతన్యవంతులు అయ్యేలా యువత నిరంతరం కృషి చేయాలని ఘట్‌కేసర్ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్ అన్నారు. పంచాయతీ పరిధి బ్రుక్‌బాండ్ కాలనీలోని ప్రెస్‌క్లబ్ ఆవరణలో ఇంకుడు గుంతల తవ్వకాన్ని సర్పంచ్ యాదగిరియాదవ్ ఆదివారం ప్రారంభించారు. భూగర్భ జలాలను వృదాగా పోనియకుండా ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టుకునేలా కృషి చేయాలన్నారు. వర్షం నీటిని నిలువ చేయటంలో పాలకులు చేసిన నిర్లక్ష్యం వల్లనే భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటి పోయానట్లు తెలిపారు. ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసి భూగర్భ జలాల పెంపుకు ముందుకు వచ్చిన విలేకరులను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గోవింద్‌రాజ్‌గౌడ్ మాట్లాడుతు భూగర్భ జలాల సంరక్షణే తమ వంతు కర్తవ్యంగా ప్రతి ఒక్కరు కృషి చేస్తే నీటి సమస్య ఉండదన్నారు.