హైదరాబాద్

పద్యనాటకాలను కాపాడుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ, మే 9: పద్య నాటకలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైన ఉందని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ డా.ఎ.చక్రపాణి అన్నారు. గురుప్రసాద్ కల్చరల్ ఫౌండేషన్ జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రఖ్యాత నటుడు నరేష్‌కు ప్రదానోత్సవ సభ గురుప్రసాద్ థియేటర్ ఫెస్టివల్ ఆధ్వర్యంలో సోమవారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన చక్రపాణి నటుడు నరేష్‌కు గురుప్రసాద్ కల్చరల్ ఫౌండేషన్ జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. నరేష్ అనేక చిత్రాలలో నటించి ప్రేక్షక హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారని తెలిపారు. నాటక రంగన్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వలపై ఉందని తెలిపారు. సభకు ముందు ఎం.అర్జునరావు దర్శకత్వంలో ప్రదర్శించిన ‘్భక్తప్రహ్లాద’ నాటకం అందరిని ఆకట్టుకుంది. అక్కినేని నాగేశ్వరరావు నాటక కళాపరిషత్ అధ్యక్షుడు సారిపల్లి కొండలరావు సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో ప్రముఖ సినీ నటి కవిత, ప్రముఖ దర్శకుడు రేలంగి నరసింహారావు, ప్రముఖ సాహితీవేత్త డా.ఓలేటి పార్వతీశం, జివి.నారాయణరావు, డా.చిల్లా రాజశేఖరరెడ్డి, ఎస్‌కె.జాఫర్, సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు వైకె నాగేశ్వరరావు, జి.మల్లిఖార్జునరావు, ఎస్‌పి త్యాగరాజు పాల్గొన్నారు.