హైదరాబాద్

రుణ విమోచన రైతుల వివరాలతో శిలాఫలకాలు ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, మే 9: రైతు రుణమాఫీ ద్వారా రుణ విముక్తులైన రైతుల పేర్లతో శిలాఫలకాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. స్థానిక మార్కెట్ యార్డులో సోమవారం రాత్రి జరిగిన ఓ కార్యక్రమంలో రుణమాఫీ కింద లబ్ధి పొందిన రైతులకు రుణ విమోచన పత్రాలు పంపిణీ చేశారు. అలాగే 50 శాతం సబ్సిడీపై జీలుగ విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి రవీంద్ర మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జిల్లాలో 17వేల మంది రైతులకు రూ.24వేల కోట్ల మేర రుణాలు మాఫీ చేయడం జరిగిందన్నారు. బందరు మండలంలో 12వేల మంది రుణాలు మాఫీ చేశామన్నారు. ఈ 12 వేల మంది రైతుల పేర్లను ఆయా గ్రామాల్లో బోర్డుల ద్వారా ప్రదర్శించడం జరుగుతుందన్నారు. మార్కెట్ యార్డు చైర్మన్ గోపు సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా అధ్యక్షులు బచ్చుల అర్జునుడు, రాష్ట్ర నాయకుడు గొర్రిపాటి గోపిచంద్, ఎంపిపి కాగిత వెంకటేశ్వరరావు, జడ్‌పిటిసి లంకే నారాయణ ప్రసాద్, టిడిపి నాయకులు తలారి సోమశేఖర్, కుంచే దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు