హైదరాబాద్

పైప్‌ల పగుళ్లు... జనానికి దిగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాంద్రాయణగుట్ట, డిసెంబర్ 20: గ్రేటర్ హైదరబాద్ ఇపుడిప్పుడే నీటి కష్టాల నుండి గట్టెకుతున్నప్పటికీ, ఎక్కడపడితే అక్కడ నీటి పైప్‌లైన్లు పగిలిపోయి దీళ్లు లీక్ అవుతుండటంతో సమస్యలు తలెత్తుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో చేపడుతున్న మెట్రోరైల్ నిర్మాణ పనుల కారణంగా ప్రధాన రోడ్లపై ఇష్టం వచ్చిన్నట్లు రోడ్లను త్రవ్వడంతో నీటి లీకేజీలు ఏర్పడానికి మరొక కారణమవుతున్నాయి. గ్రేటర్ హైదరబాద్ ప్రజల దాహార్తిని తిర్చేందుకు జలమండలి కృష్ణా ఫేజ్-1, 2, 3 నిర్మాణంలో భాగంగా నాగార్జునసాగర్ నుంచి జంటనగరాల్లోని వివిధ ప్రాంతాల్లో నీటి పైప్‌లైన్లు వేసింది. ఇటీవల కాలంలో గోదావరి జలాలల తరలింపు పథకాన్ని పూర్తి చేసి దాదాపు రెండు వందల కిలోమీటర్ల మేర నీటి పైప్‌లైన్ నిర్మాణ పనులను చేపట్టింది. నాగార్జునసాగర్ నుంచి గ్రేటర్‌కు సంబంధించిన పైప్‌లైన్‌ను పనులను నిర్మించి సాహెబ్‌నగర్‌లోని నీటి శుద్దిప్లాంట్‌కు అనుసంధానం చేశారు. సాహెబ్‌నగర్‌కు చేరుకున్న కృష్ణా నీటిని రింగ్‌మెయిన్-1, రింగ్‌మెయిన్-2ల కింద నగరంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తారు. సాహెబ్‌నగర్ నుంచి తరలిస్తున్న నీటికి సంబంధించి బాలాపూర్, సంతోష్‌నగర్, మైలార్‌దేవ్‌పల్లి తదితర రిజర్వాయర్‌లకు తరలిస్తున్నారు. పైప్‌లైన్‌ల సామర్థ్యాన్ని గుర్తించి టెక్నికల్ అధికారుల సూచనల మేరకు అందుకు మోతాదు స్థాయిలో నీటిని సరఫరా చేయాల్సి ఉంటుంది. రిజర్వాయర్‌లలో పనిచేస్తున్న సిబ్బంది మాత్రం అధికారులు సూచనలు, సలహాలు పాటించకపోవడంతో ఇష్టం వచ్చిన్నట్లు నీటిని రిజర్వాయర్ల నుంచి విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో పైప్‌లైన్లలో నీటి ఉదృతిపేరగడంతో పైప్‌లైన్లు లీకేజీ ఏర్పడానికి అస్కారం కలుగుతొందని పలువురు నీపుణులు అంటున్నారు. ఇది ఇలా ఉండగా కొన్ని రోజుల నుంచి బాలాపూర్, మైలార్‌దేవ్‌పల్లి, ఉప్పల్, తార్నాక, హబ్సీగూడ, చాంద్రాయణగుట్ట, సురారం, జీడిమెట్ల, హెచ్‌ఎంటి చింతల్, కత్బుల్లాపూర్, కుషాయిగూడ, సైనిక్‌పూరి, నాచారం, నారాయణగుడా, కాచిగూడ క్రాస్‌రోడ్డు, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, ఎల్‌బి నగర్, సంతోష్‌నగర్ తదితర ప్రాంతాల్లోని ప్రధాన రోడ్లపై పైప్‌లైన్లు పగిలి నీరు వృధాగా చేరడంతో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. కోట్లాది కొద్ది రూపాయలు వెచ్చించి ప్రభుత్వం గోదావరి, కృష్ణా జలాలలను నగరానికి తీసుకువస్తున్న క్రమంలో.. రోడ్లు , భవనాల శాఖ, జలమండలి, మేట్రోరైల్ అధికారుల మధ్య సమన్వయం లేక.. ఇష్టం వచ్చిన్నట్లు రోడ్ల తవ్వకాలు చేపట్టడంతో ఇలా జరుగుతోంది. నాణ్యతలేని పైప్‌లను వాడటం కూడా తరుచూ లీకేజీలు ఏర్పడటానికి కారణం. జంటన నగరాల ప్రజల దాహార్తిని తీర్చే జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్, హిమయత్‌సాగర్‌లో నీటి మట్టాలు పడిపోవడంతో ఇక్కడి నుంచి నీటి పంపింగ్‌ను నిలిపివేశారు. అదే విధంగా సింగూరు, మంజీరాల నుంచి నీటి సరఫరాను నగరానికి నిలిపివేశారు. గ్రేటర్ హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీర్చాడానికి ప్రస్తుతం కృష్ణా, గోదావరి జలాలే దిక్కయ్యయి. రాజధాని ప్రజల దాహార్తిని తీర్చాడానికి ప్రస్తుతం గోదావరి, కృష్ణా నదుల నుంచి దాదాపు 345 ఎంజిడిల నీటిని ప్రతి రోజు సరఫరా చేస్తున్నామని జలమండలి పేర్కొంటుంది. నగరవాసుల దాహార్తిని తీర్చేందుకు జలమండలి ప్రతి నెల రూ.40 నుండి రూ.50లక్షలు విద్యుత్ బిల్లులను చెల్లిస్తొంది. లక్షల రూపాయలు విద్యుత్‌బిల్లులు చెల్లిస్తున్న జలమండలి నీటి లీకేజీలను అరికట్టడంపై దృష్టి సారించడంలేదు. ఈ నీటి లీకేజీలు మాత్రం కాంట్రాక్టర్ల పాలిట వరంగా మరాయి. పెద్ద మొత్తంలో బిల్లులు చెల్లస్తున్న జలమండలి నీటి లీకేజీలను అరికట్టడంలో ఆ స్థాయిలో దృష్టి సారించడంలేదన్న విమర్శ ఎల్లడెల్లా విన్పిస్తున్నాయి.