హైదరాబాద్

టెన్త్ పరీక్ష ఫలితాల్లో నగరం లాస్ట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, చాంద్రాయణగుట్ట, మే 11: టెన్త్‌క్లాస్ పరీక్షా ఫలితాల్లో ఈ సారి హైదరాబాద్ నగరం వెనకబడిపోయింది. బుధవారం విడుదలైన ఫలితాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 85.63 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా, హైదరాబాద్ జిల్లాలో 76.23 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. రాష్టవ్య్రాప్తంగా అన్ని జిల్లాల కన్నా ఎక్కువ వరంగల్ 95.13 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి ఆ జిల్లా మొదటి స్థానంలో ఉండగా, 91.18 శాతంతో మహబూబ్‌నగర్ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. కానీ అతి తక్కువ ఉత్తీర్ణత శాతంతో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు చివరి స్థానంలో నిలిచాయి. రాష్టవ్య్రాప్తంగా పోల్చితే ఈసారి హైదరాబాద్ జిల్లాలో ఉత్తీర్ణత శాతం గత సంవత్సరం కంటే 12 శాతానికి పెరిగిందని జిల్లాలో మొత్తం 68వేల మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 56వేల మంది ఉత్తీర్ణులైనట్లు సోమిరెడ్డి తెలిపారు. నగరంలోని 12 మండలాల్లోని 188 ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్లకు చెందిన 6వేల 664 మంది పరీక్షలు రాగా, 4వేల 600 మంది ఉత్తీర్ణులైనట్లు తెలిపారు. అలాగే 105 ఎయిడెడ్ పాఠశాలలకు చెందిన 4607 మంది పరీక్షలు రాయగా, 3377 మంది పాసైనట్లు తెలిపారు. అలాగే గవర్నమెంటు ఎయిడెడ్ స్కూళ్లను కలుపుకుని 293 పాఠశాలలకు చెందిన 11వేల 271 మంది పరీక్షలకు హజరుకాగా, 7వేల 977 మంది ఉత్తీర్ణులైనట్లు తెలిపారు. ఇందులో సైదాబాద్ మండలం 83.61 ఉత్తీర్ణత శాతంతో జిల్లాలో మొదటి స్థానంలో నిలువగా, రెసిడెన్షియల్ స్కూల్స్ 82.20 శాతంతో ద్వితీయ స్థానంలో నిలువగా, ముషీరాబాద్ మండలం 79.28 శాతంతో తృతీయ స్థానంలో నిలిచింది. 59.20 శాతం ఉత్తీర్ణతతో బహద్దూర్‌పురా మండలం చివరి స్థానానికే పరిమితమైంది. పరీక్షల్లో తప్పిపోయిన విద్యార్థులకు వచ్చే నెల 15న అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు, ఇందుకు గాను ఈ నెల 26వ తేదీలోపు పరీక్ష ఫీజును చెల్లించుకోవచ్చునని విద్యాశాఖాధికారులు బుధవారం తెలిపారు.
11 ప్రభుత్వ పాఠశాలలో వంద శాతం ఉత్తీర్ణత
హైదరాబాద్ జిల్లా పరిధిలోని 11 ప్రభుత్వ పాఠశాలలు టెన్త్ పరీక్షల్లో నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించారు. వాటిలో బహద్దూర్‌పురా మండలంలో శాలిబండ బాలురు, బాలికల ఉన్నత పాఠశాల, దారుషిఫాలోని బ్లైండ్ గర్ల్స్ హై స్కూల్, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల చార్‌మహాల్, సైదాబాద్ మండలంలోని మాదన్నపేట గర్ల్స్ హై స్కూల్, కాచిగూడ జిజిహెచ్‌ఎస్, మలక్‌పేటలోని బ్లైండ్ గర్ల్స్ హై స్కూల్, మలక్‌పేట డెఫ్ అండ్ డెం గర్ల్స్ హై స్కూల్‌లు ఉండగా, గోల్కొండ మండలంలోని గర్ల్స్ హై స్కూల్(తెలుగు) గోల్కొండ, నాంపల్లిలోని గర్ల్స్ హై స్కూల్ గోషామహాల్(ఉర్దూ), సికిందరాబాద్‌లోని గర్ల్స్ హై స్కూల్ వైఎంసిఏ, సికిందరాబాద్ పాఠశాలలున్నాయి.