హైదరాబాద్

నిజామియాకు పూర్వ వైభవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 11: పాతబస్తీలోని నిజామియా ప్రభుత్వ ఆసుపత్రి ప్రపంచంలోనే పేరుగాంచిందని, దీనికి పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని, సర్కారు వైద్యాన్ని మెరుగుపరిచేందుకు ఎన్ని నిధులైనా వెచ్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, వైద్యారోగ్యశాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు డిప్యూటీ సిఎం, మంత్రి కలిసి నగరంలోని పలు సర్కారు ఆసుపత్రులను పరిశీలించారు. తొలుత చార్మినార్‌లోని నిజామియా ప్రభుత్వ యునాని ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలోని ఆపరేషన్ ధియేటర్, లేబర్ రూం, పంచకర్మ చికిత్స, హాస్టల్ భవనం విభాగాలను సందర్శించి, అక్కడ అందుతున్న సేవల గురించి రోగులను అడిగి తెల్సుకున్నారు. ఆ తర్వాత హాస్టల్ విద్యార్థులు, నర్సింగ్ స్ట్ఫాతో, వైద్యులతో మాట్లాడి ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న సేవల గురించి ఆరా తీశారు. ఈ యునాని ఆసుపత్రి పాతబస్తీ వాసులకే గాక, గతంలో చుట్టుపక్కల జిల్లాల ప్రజలు కూడా ఇక్కడకు వచ్చి అనేక రకాల వ్యాధులను నయం చేసుకున్నారని వివరించారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈ ఆసుపత్రి తన ఉనికిని కోల్పోయిందన్నారు. ఆసుపత్రి భవన పునరుద్దరణకు, వౌలిక సదుపాయాల కల్పనకు చేపట్టాల్సిన చర్యలకు సంబంధించి సమగ్ర ప్రతిపాదనలు తయారు చేసి తనకు పంపాలని ఆదేశించారు. అదే విధంగా వైద్యులు పారామెడికల్, నాలుగో తరగతి పోస్టుల భర్తీకై ప్రతిపాదనలు పంపాలన్నారు. ఆయుర్వేద ఆసుపత్రి తరలింపుపై స్తానికులు ప్రశ్నించగా, అందుకు స్పందిస్తూ మంత్రి ఆసుపత్రి తరలింపు అంశంపై ఏర్పాటు చేసిన కమిటీ త్వరలో నిర్ణయం తీసుకుంటుందన్నారు.
డిప్యూటీ సిఎం మహమూద్ అలీ, ఎమ్మెల్యేలతో కలిసి డబీర్‌పురా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఇక్కడ 50 పడకల ఆసుపత్రిని, టిబి యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలు సత్వరమే పంపాలని ఆదేశించారు. అనంతరం డిప్యూటీ సిఎం మహమూద్ అలీ మాట్లాడుతూ పాతబస్తీలోని ఆసుపత్రులన్నీ అత్యాధునికంగా తీర్చిదిద్ది ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలందించేందుకు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తామన్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందించే అంశంపై ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్తశుద్ధితో ఉన్నారని, ఇందులో భాగంగానే తాము ఈ ఆసుపత్రులను సందర్శిస్తున్నట్లు తెలిపారు. అనంతరం సైదాబాద్‌లో పర్యటిస్తున్న సమయంలో అక్కడ ఖాళీగా ఉన్న రెండు ఎకరాల ప్రభుత్వ ఖాళీ స్థలంలో జూనియర్, డిగ్రీ కాలేజీని నిర్మించేందుకు ఈ స్థలాన్ని కేటాయించాలని స్థానిక ఎమ్మెల్యే కోరారు. ఈ పర్యటనలో ఆయుష్ కమిషనర్ జనార్దన్ రెడ్డి, వైద్య విధాన పరిషత్ కమిషనర్ వీణాకుమారి, డిసిహెచ్‌ఎస్ డా.సుజాత, ఎంఎస్‌ఐడిసి చీఫ్ ఇంజనీర్ లక్ష్మారెడ్డి, ఆసుపత్రి సూపరింటెండెంట్లు డా.హబీదా, డా.రాజీవ్‌రాజు, హైదరాబాద్ డిఎంహెచ్‌వో పద్మజ, ఆర్టీవో నిఖిల ఉన్నారు.

సంస్కృతి, సంప్రదాయాలకు
నిలయం తెలంగాణ
హైదరాబాద్, మే 11: తెలంగాణ రాష్ట్రం సంస్కృతి,సంప్రదాయాలకు నిలయమని హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జి అదనపు జాయింట్ కలెక్టర్ అశోక్‌కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 10 నుంచి 16వరకు జిల్లా స్థాయిలో తెలంగాణ కళారాధనోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భాషా సంస్కృతిక, సమాచార, పర్యటక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఉత్సవాలను జిల్లాలవారీగా నిర్వహిస్తున్నారని చెప్పారు. హైదరాబాద్ జిల్లాలో తెలంగాణ కళారాధన ఉత్సవాలను నాంపల్లిలోని ఎగ్జిబిషన్ మైదానంలో ఏర్పాటు చేసిన కళావేదికపై ఎజెసి అశోక్‌కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని కళాకారులను ప్రోత్సహించడంతో పాటు వివిధ కళారూపాలు అంతరించి పోకుండా జీవం పోస్తుందని అన్నారు. ఎన్నో కళలు, సంస్కృతి, సంప్రదాయాలకు నిలయమైన తెలంగాణ కళాకారుల ఉనికిని వెలుగులోకి తేవడం కళాకారులందరూ గర్వించాల్సిన విషయమని పేర్కొన్నారు. హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి వనం సత్యేందర్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రభుత్వం సాంస్కృతిక సంస్థను ఏర్పాటు చేసి తద్వారా వివిధ కళారూపాలను, కళాకారులను ప్రోత్సహించడం అభినందించదగిన అంశమని చెప్పారు. సమాచార పౌర సంబంధాల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రమాదేవి మాట్లాడుతూ ప్రభుత్వ అదేశాలను అనుసరించి జిల్లాలోని కళాకారులకు వారం రోజుల పాటు ప్రదర్శనలను ఇచ్చే అవకాశాన్ని కల్పిస్తున్నామని అన్నారు. ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులు రాజేందర్, అశ్విన్‌కుమార్, హైదరాబాద్ జిల్లా డివిజినల్ పిఆర్‌ఓ ప్రణీత్‌కుమార్, జిల్లా టిఎస్‌ఎస్ కోఆర్డినేటర్ సందీప్, ఎవిఎస్ సుబ్రహ్మణ్యం, పబ్లిసిటి అసిస్టెంట్ నాగరాజుశర్మ పాల్గొన్నారు.
* అకట్టుకున్న బోనాలు, పోతురాజుల వేడుకలు
తెలంగాణ ప్రాంతంలో ఎంతో వైభవోపేతంగా జరుపుకునే బోనాలు, జాతర, పోతురాజుల నృత్యం, కూచిపుడి నృత్యం, డప్పువాయిద్యాలు, జానపద గేయాలు వంటి కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. రెండు రోజులుగా నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై జరుగుతున్న కార్యక్రమాలను వీక్షించడానికి అనేక మంది తరలివస్తున్నారు. మొదటి రోజు కళావేదికపై శివమ్మ బృందం శారద కథ, ఎ.హరిప్రియ కూచిపూడి నాట్యం, క్రాంతికుమార్ బృందం డప్పులు, శ్రీనివాస్‌గౌడ్ బృందం పాడిన జానపద గేయాలు, వాణి బోనాలు, వడ్డెపల్లి శ్రీనివాస్ జానపద గేయాలు, రత్నం, అశోక్‌కుమార్ డప్పు, మిమిక్రి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

నృత్య జీవితంలో ‘ఆముక్తమాల్యద’ అపూర్వ ఘట్టం
హైదరాబాద్, మే 11: నలభై ఐదేళ్ల నృత్యజీవితంలో ‘ఆముక్తమాల్యద’ నృత్యరూపకం తనకెంతో సంతృప్తిని, ఖ్యాతిని ఇచ్చిందని, ఆ నృత్యరూపకంలో శ్రీకృష్ణ దేవరాయల పాత్ర అంతర్జాతీయ స్థాయిలో తనకు ఎంతో గౌరవాన్ని తెచ్చిపెట్టిందని ప్రముక నాట్యాచారుడు కెవి సత్యనారాయణ తెలిపారు. కెనడా, లండన్, ఆటా, తానాలో తనను పిలిపించుకుని తమ పిల్లలకు నృత్యం నేర్పించమని అడగటం తనకెంతో గొప్ప అనుభూతిని కలిగించిందని అన్నారు. బుధవారం ఉదయం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ శృతిలయలు చిత్రానికి నృత్యదర్శకత్వం వహించి 1988లో రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు, భరతముని అవార్డు పొందానని తెలిపారు.
నృత్యశిక్షణ ప్రారంభ దశ గురించి ప్రస్తావిస్తూ భరత కళా ప్రపూర్ణ కోరాడ నర్సింహారావు, డా.వెంపటి చినసత్యం, వేదాంతం ప్రహ్లాద శర్మ శిష్యరికంలో అనేక మెళకువలు నేర్చుకుని అంచెలంచేలుగా ఎదిగి రోజు అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందానని సత్యనారాయణ తెలిపారు. ఈనెల 21న తంజావూరులోని నేలట్టూరులో మనుచరిత్ర, పారజాతపహరణం, పాండురంగ మహాత్మ్యం, ఆముక్తమాల్యద, పంచ కావ్యాల మిశ్రమ నృత్య ప్రదర్శనను ఇస్తున్నానని చెప్పారు. నృత్యానికి శరీర సౌష్టం చాలా ముఖ్యం. నర్తకులు చేసే అంశాన్నిబట్టి సామర్థ్యాన్నిబట్టి శరీరాన్ని అంశానికి తగినట్టుగా అభినయంలో చూపగలగాలని, మిడిమిడి జ్ఞానంతో కొంతమంది నృత్యానికి అపకీర్తి తెస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన నృత్య జీవితం గురించి మాట్లాడుతూ అలనాటి ప్రముఖ హిందీ నటి పద్మిని బొంబాయికి పిలుపించుకుని తన దగ్గర నృత్యం నేర్చుకుందని, తనతోపాటు ఏలూరు వచ్చి అనేక మెళకువలు నేర్చుకుందని తెలిపారు. 2009లో రాష్ట్ర ప్రభుత్వం కళారత్న పురస్కారంతో సత్కరించిందని, 2008లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశిష్ట సేవా పురస్కారంతోనూ 2013లో తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారంతో సత్కరించాయని పేర్కొన్నారు. తను ప్రతి సంవత్సరం ఐదు నెలలపాటు విదేశాలలో పర్యటించి అక్కడి విద్యార్థులకు నృత్యంలో శిక్షణ ఇస్తుంటానని తెలిపారు. పాత్రోచిత శరీర సౌష్టవం ఉండాలి
కూచిపూడి నృత్యంలో ప్రదానంశం భామా కలాపం ప్రదర్శనలో నర్తకిలో సత్యభామా కనిపించాలని, కానీ ఇటీవల కొంతమంది నాట్యాచార్యులు చిన్న పిల్లలచేత భామా కలాపం అంశం చేయిస్తున్నారని విమర్శనాత్మకంగా అన్నారు. భామా కలాపం అంశాన్ని ప్రదర్శించేటప్పుడు శరీర సౌష్టవంతోపాటు అభినయం, సత్యభామ ప్రౌఢత్వం, హుందాతనం కనబడాలని, పసిపిల్లలలో అవి కనిపించేలా అభినయించడం చాలా కష్టమని చెప్పారు.