హైదరాబాద్

పత్తాలేని మోడ్రన్ ‘బస్ బే’లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 20: మహా నగరంలో రోజురోజుకి పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు సర్కారు ఎంత వేగంగా ప్రయత్నాలు చేస్తుందో, అంతే వేగంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ పెరుగుతోంది. పలు రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య తీవ్రమయ్యేందుకు ‘బస్ బే’లు ఓ ప్రధాన కారణమని ఇప్పటికే పలు అధ్యయనాల్లో గుర్తించిన అధికారులు రోడ్డుపై ట్రాఫిక్‌కు ఎలాంటి ఆటంకాలేర్పడకుండా మాడ్రన్ బస్ బేలను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్దం చేసినా, అవి ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్టు తయారైంది. ఫలితంగా పలు చోట్ల ప్రయాణికులు బస్సుల కోసం రోడ్లపై నిరీక్షించాల్సి వస్తోంది. రోడ్డు మధ్యలో నుంచి, కుడివైపు ఆర్టీసి బస్సులు దూసుకువచ్చి, ఒక్కసారిగా ఎడమవైపున్న బస్ బేలకు మరలటంతో వెనకానున్న వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రతిరోజు ఇలాంటి ఘటనలు పదుల సంఖ్యలో జరుగుతూ, వాహనదారులకు, ఆర్టీసి డ్రైవర్ల మధ్య గొడవలు చోటుచేసుకుంటున్నాయి. ఇదేమిటంటూ ప్రశ్నించే వాహనదారులకు ఆర్టీసి డ్రైవర్లు దురుసుగా సమాధానం చెబుతున్నారని, కొన్ని సందర్భాల్లో డ్రైవర్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన సందర్భాలూ ఉన్నాయి.
పాపం..పాదచారులు
సర్కారు ఎన్ని చర్యలు చేపట్టినా పలు ప్రాంతాల్లో రోజురోజుకి ట్రాఫిక్ పెరుగుతూనే ఉంది. పాదచారులు రోడ్డు దాటాలన్నా, ఫుట్‌పాత్‌పై నడవాలన్నా ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవల్సిన పరిస్థితి తలెత్తింది. రెండు నెలల వ్యవధిలో 40 మంది పాదచారులు రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందినట్లు గత అధ్యయనాల్లో తేలిన నేపథ్యంలో నిత్యం రద్ధీగా ఉండే పలు చోట్ల వారి సౌకర్యార్థం ఫుటోవర్ బ్రిడ్జిలు, సబ్‌వేల నిర్మాణానికి రూపకల్పన చేశారు. మొత్తం రూ. 9.18 కోట్లతో చేపట్టనున్న ఈ పనుల్లో భాగంగా రూ. 5.15 కోట్లతో నగరంలోని 103 బస్‌బేలను ఆధునీకరించేందుకు కేటాయించారు. మిగిలిన రూ. 4.38 కోట్ల నిధులతో ఎఫ్‌వోబిలు, సబ్‌వేలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినా, వీటి ఏర్పాటుకు ఎజెన్సీలు ముందుకు రావటం అధికారులకు తలనొప్పిగా మారింది. ఇక బస్ బేలకు సంబంధించి ఈస్ట్‌జోన్‌లోని సర్కిల్ 1,2,3లో రూ. 65 లక్షల వ్యయంతో 13 బస్‌బేలను ఏర్పాటు చేయనున్నారు. అలాగే సౌత్ జోన్ పరిధిలోని సర్కిల్ 4,5,6ల్లో మరో 28 బస్ బేలను తీర్చిదిద్దేందుకు రూ. 1.40కోట్లను వెచ్చించేందుకు ఈ ప్రతిపాదనలు చేశారు. వీటితో పాటు సెంట్రల్ జోన్‌లోని సర్కిల్ 7,8,9ల్లో మరో 28, వీటితో పాటు వెస్ట్‌జోన్‌లోని సర్కిల్ 11, 12,13ల్లో 17, నార్త్‌జోన్ పరిలోని సర్కిల్ 15,16,17,18ల్లో మరో 17 బస్ బేలను ఆధునీకరించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఏ మాత్రం ముందుకు సాగటం లేదు. తొలుత ప్రయోగాత్మకంగా ఓ మాడ్రన్ బస్ బేను నిర్మించేందుకు అధికారుల క్షేత్ర స్థాయి అధ్యయనం చేసినా, ఏ సర్కిళ్లలో ఏర్పాటు చేయాలన్న విషయం నేటికీ తేలకపోవటం గమనార్హం.