హైదరాబాద్

గ్రేటర్‌ను సందర్శించిన ల్యాంబెత్ మేయర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 12: ఏ దేశమేగినా..ఎందుకాలిడినా పొగడరా నీ జాతి నిండు గౌరవాన్ని అన్నది నిజం చేశారు నల్గొండలో జన్మించి, లండన్‌లోని ల్యాంబెత్ నగర మేయర్‌గా కొనసాగుతున్న సలేహా జాఫర్. నల్గొండ పట్టణంలో పుట్టి, అక్కడే పాఠశాల విద్యను పూర్తి చేసుకుని దాదాపు 57 రకాల భాషలు మాట్లాడే సుమారు 6లక్షల మంది నివాసముండే ల్యాంబెత్ నగర ప్రథమ పౌరురాలిగా వ్యవహరిస్తున్న సలేహా జాఫర్ హైదరాబాద్ నగర పర్యటనకు గురువారం వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మేయర్ బొంతు రామ్మోహన్‌ను జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం హైదరాబాద్ నగరం గణనీయంగా అభివృద్ధి చెందుతోందని కితాబునిచ్చారు. అంతేగాక, లండన్‌లో హైదరాబాద్ నగరానికి ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉందని సలేహా జాఫర్ వ్యాఖ్యానించారు. అంతేగాక, హైదరాబాద్ నగర కౌన్సిల్ నిర్వహణ, ల్యాంబెత్ నగర కౌన్సిల్ నిర్వహణ విధానాల్లో ఎంతో సామీప్యత ఉందని పేర్కొన్నారు. గతంలో తాను హైదరాబాద్ నగరంలో పర్యటించానని, అప్పటికీ, ఇప్పటికీ ఎంతో మార్పు వచ్చిందని, సిటీ ఎంతో గణనీయమైన అభివృద్ధి కన్పిస్తోందని అన్నారు. హైదరాబాద్ నగరాన్ని గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దటానికి స్ట్రాటెజికల్ రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్(ఎస్‌ఆర్‌డిపి) సహా అనేక అభివృద్ధి కార్యక్రమాలను జిహెచ్‌ఎంసి ఆధ్వర్యంలో చేపట్టడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. దాదాపు 57 భాషలు మాట్లాడే సుమారు 6లక్షల మంది జనాభాతో ల్యాంబెత్ నగరం మినీ వరల్డ్‌గా ఉంటుందని ఆమె వివరించారు. ఎన్నో దశాబ్దాల క్రితం లండన్‌లో స్థిరపడ్డప్పటికీ తెలంగాణ, సంస్కృతి, సంప్రదాయాలు మరువలేదని ఆమె వివిరంచారు. లేబర్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నానని, తన నగరంలో 65 మంది కౌన్సిలర్లు ఉన్నారని వివరించారు. హైదరాబాద్ మేయర్‌ను తమ నగర పర్యటనకు రావాలని సలేహా ఈ సందర్భంగా ఆహ్వానించారు. అనంతరం మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ తెలంగాణ ఆడ బిడ్డ అయిన సలేహా జాఫర్ ల్యాంబెత్ నగర మేయర్‌గా ఉండటం గర్వకారణమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు చేపడుతున్న అభివృద్ధి పనులను మేయర్ ఆమెకు వివరించారు.