హైదరాబాద్

నిమ్స్‌కు ఖరీదైన క్యాథటార్స్‌ను అందించిన అమెరికా వైద్యుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, మే 13: తెలుగు రాష్ట్రాల్లో ప్రతిష్టాత్మక ఆసుపత్రిగా పేరొందిన నిమ్స్ ఆసుపత్రికి అమెరికాకు చెందిన వైద్యుడు శ్రీకర్ వీరారెడ్డి ఖరీదైన క్యాథటర్స్‌ను అందజేశారు. శుక్రవారం నిమ్స్ ఆసుపత్రికి వచ్చిన ఆయన గుండె సంబంధ వ్యాధితో బాధపడే వారికి శస్తచ్రికిత్సలో ఉపయోగించే క్యాథటార్స్‌ను నిమ్స్ డైరెక్టర్ మనోహర్‌కు అందజేశారు. 1997వ సంవత్సరంలో మనోహర్ వద్ద శిక్షణ పొందిన శ్రీకర్ వీరారెడ్డి తన గురువు నిమ్స్ డైరెక్టర్‌గా ఉండటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. పేదరికంలో మగ్గుతూ గుండె సంబంధ వ్యాధితో బాధపడే వారికి వీటిని అమర్చాల్సిందిగా డైరెక్టర్‌ను కోరారు. సుమారు 15 లక్షల విలువ చేసే క్యాథటార్స్‌ను నిమ్స్‌కు అందించడం అభినందనీయమని మనోహర్ అన్నారు. రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిమ్స్ వైద్యులు నిమ్మ సత్యనారాయణ, శేషగిరి రావు, చీఫ్ సెక్యూరిటీ అధికారి ఉమేష్ పాల్గొన్నారు.