హైదరాబాద్

పాఠశాల, కళాశాలలకు సొంత భవనాలు: కడియం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 16: హైదరాబాద్ జిల్లాలోని ప్రభుత్వ, విద్యాసంస్థల స్వరూపాన్ని దాదాపు 100 కోట్ల రూపాయలతో సమూలంగా మార్చనున్నట్లు ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖామాత్యులు కడియం శ్రీహరి వెల్లడించారు. హైదరాబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలో ప్రాథమిక, వౌలిక సదుపాయాల కల్పనకు, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది నియామకానికి దాదాపు రూ.200 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశామని, రూ.100 కోట్ల రూపాయలు వచ్చే ఆరు నెలల్లో వెచ్చించనున్నట్లు తెలిపారు. వందకోట్లలో రూ.25 కోట్ల రూపాయలను ఇవ్వడానికి జిల్లాలోని ప్రజాప్రతినిధులు సంసిద్ధత వ్యక్తం చేశారని, రూ.25 కోట్ల రూపాయలు జిహెచ్‌ఎంసి నుంచి సమీకరిస్తామని, మ్యాచింగ్ గ్రాంట్‌గా ప్రభుత్వం నుండి మరో రూ.50 కోట్లు కేటాయించనున్నట్లు ఆయన తెలిపారు. సర్వశిక్షాభియాన్ డైరెక్టర్ కార్యాలయంలో సోమవారం సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎక్సైజ్ శాఖామాత్యులు పద్మారావులతో కలిసి విద్యాశాఖ పనితీరుపై సమీక్షించారు. సమీక్షకు హాజరైన హైదరాబాద్ జిల్లా శాసనసభ్యులు, శాసన మండలి సభ్యుల నుంచి విద్యాప్రమాణాలు పెంచడంలో, కల్పించాల్సిన వౌళిక వసతుల కల్పనకు చేపట్టాల్సిన చర్యలపై సలహాలు, సూచనలు తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ డిగ్రీ కళాశాలలో సత్వరమే కల్పించాల్సిన సదుపాయాల్లో ఐదు అంశాలు ముఖ్యమైనవిగా గుర్తించామని కడియం అన్నారు. వాటిల్లో పాఠశాల , జూనియర్, డిగ్రీ కళాశాలల్లో కల్పించాల్సిన ప్రాథమిక సౌకర్యాలు, వాటర్, విద్యుత్తు కనెక్షన్, ప్రహరీగోడలు, టాయిలెట్లు ఉన్నచోట వాటిని వినియోగంలోనికి తీసుకురావటం, లేని చోట నూతనంగా నిర్మించడం, దశాబ్దాల కింద నిర్మించిన పాఠశాల భవనాలను గుర్తించి వాటికి అవసరమైన మరమ్మతులు/పునరుద్ధరణ ఏర్పాట్లు, అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న పాఠశాలలకు సొంత భవనాలు నిర్మించేందుకు వీలుగా అనుకూలమైన ప్రభుత్వ స్థలాలు కేటాయించడం, అదనపు తరగతి గదుల నిర్మాణం, ఫర్నీచరు అవసరమైన పాఠశాలలు, కంప్యూటర్ శిక్షకులు అవసరమైన పాఠశాలలు వంటిని ముఖ్యమైనవని పేర్కొన్నారు. కార్యాచరణ ప్రణాళికను నియోజకవర్గాల వారీగా ఈ నెలాఖరులోగా తయారు చేయాలని హైదరాబాద్ జిల్లా కలెక్టరు రాహుల్ బొజ్జాను ఆదేశించారు. హైదరాబాద్‌ను విద్యాపరంగా మోడల్ జిల్లాగా తయారు చేయాలన్నారు. పాఠశాల, కళాశాల, ఐటిఐ, పాలిటెక్నిక్‌లలో కావల్సిన
వౌలిక వసతులను కల్పిస్తూ, విద్యా ప్రమాణాలు పెంచాలని, పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉందని అన్నారు. ప్రాథమిక సదుపాయాలైన త్రాగునీరు, విద్యుత్తు, ప్రహరీగోడ, మరుగుదొడ్లు, ఫర్నీచర్ తదితరాలను ఏ విధంగా కల్పించాలన్న ప్రణాళికతో ముందుకు వెళ్ళాలన్నారు. పలు నియోజకవర్గాలో జూనియర్, డిగ్రీ కళాశాలలు లేవని పలువురు శాసనసభ్యులు సమీక్షలో దృష్టికి తెచ్చారని, పరిశీలించి అవసరం మేరకు ఏర్పాటుచేయడానికి ప్రయత్నం చేస్తామన్నారు. అదేవిధంగా ఆయా నియోజకవర్గాలలో గల ప్రభుత్వ ఖాళీ స్థలాలను గుర్తించాలని కలెక్టర్‌కు సూచించారు. పదవ తరగతి, ఇంటర్మీడియెట్ ఫలితాలలో వచ్చే సంవత్సరం జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని, జిల్లాలోని ప్రజాప్రతినిధులు పూర్తిస్థాయిలో సహకరించాల్సిందిగా కోరారు. పాఠశాల విద్య, జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ గ్రంథాలయాల పనితీరుపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ నియోజకవర్గాల అభివృద్ధి నిధుల కింద ఈ సంవత్సరం నుంచి ఒక్కో నియోజకవర్గానికి కోటి రూపాయలు వస్తుందని, ఆ నిధులను ఆయా నియోజకవర్గ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు.. పాఠశాలలు, జూనియర్ కళాశాలల వౌలిక వసతుల కల్పనకు వినియోగించుకోవాలని అన్నారు. జిహెచ్‌ఎంసి నుంచి ఫర్నిచరు కోసం రూ. 25కోట్ల ఇవ్వాలని, నేషనల్ గ్రాంట్‌గా ప్రతి నియోజకవర్గానికి రూ.4కోట్లు ఇవ్వాల్సిందిగా ఉప ముఖ్యమంత్రిని కోరారు. మంత్రి పద్మారావు మాట్లాడుతూ నియోజకవర్గ నిధులతో పాటు అవసరమైతే మరో కోటి రూపాయలు ఇవ్వడానికి అందరు సిద్ధపడాలన్నారు. ప్రతి పాఠశాలలో రన్నింగ్ వాటర్ వసతితో పాటు శానిటేషన్, స్కావెంజర్ స్వీపరు, వాచ్‌మెన్‌లను విధిగా ఏర్పాటుచేయాలని కోరారు. ప్రతి పాఠశాలలో స్వీపరుతోపాటు స్కావెంజరును ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ పరిపాలన శాఖ నుండి ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చిందని, వాటిని విధిగా అమలు చేయాలని విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రంజీవ్ ఆచార్య తెలిపారు. స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలు ఏర్పాటు చేయాలని, కొన్ని పాఠశాలలను క్లబ్ చేసి ఔట్ సోర్సింగ్ ద్వారా ఎంగేజ్ చేసుకోవచ్చని సూచించారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాల్సిన అవసరం అందరిపై ఉందని, ప్రభుత్వ పాఠశాలలో ఉన్న గ్యాపులను పరిశీలించి అందుకవసరమైన చర్యలను చేపట్టాలని సూచించారు. విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావాలని, ఖాళీ పోస్టులను త్వరగా భర్తీ చేయాలని, నిరంతర పర్యవేక్షణ ఉండాలని, పాఠ్యపుస్తకాలు, యూనిఫారాల పంపిణీలో జాప్యం లేకుండా చూడాలని, అంగన్‌వాడీ స్కూళ్లను ప్రైమరీ పాఠశాలలకు లింకప్ చేయాలని, ఎయిడెడ్ పాఠశాలలపై పర్యవేక్షణ చేయడంతోపాటు ఉపాధ్యాయుల నియామకం, వాటి అభివృద్ధికి దృష్టి సారించాలని పలువురు శాసనసభ్యులు కోరారు. పాఠశాలలు, హాస్టళ్ల కరెంట్ బిల్లుల చెల్లింపులో జాప్యం జరగడంతో డిస్‌కనెక్షన్ చేస్తున్నారని, డిస్‌కనెక్షన్ చేయకుండా స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వాలని కోరారు. సమీక్షలో ఎమ్మెల్సీలు జాఫ్రీ, ఎంఎస్ ప్రభాకర్‌రావు, జనార్ధన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి(అంబర్‌పేట్), రాంచంద్రారెడ్డి (ఖైరతాబాద్), రాజాసింగ్ (గోషామహల్), మోజంఖాన్ (బహదూర్‌పుర), కౌసరుద్దీన్ (కార్వాన్), పాషాఖాద్రీ (చార్మినార్), బలాలా (మలక్‌పేట్), ముంతాజ్ అహ్మద్‌ఖాన్ (యాఖుత్‌పుర), జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్‌రెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ రాహుల్ బొజ్జా, ఇంటర్మీడియెట్ విద్యా కమిషనర్ అశోక్‌కుమార్, పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు కిషన్, సాంకేతిక విద్యా శాఖ సంచాలకుడు ఎంవి రెడ్డి, పాల్గొన్నారు.