హైదరాబాద్

ఐదుగురు గోల్డ్‌స్మిత్‌ల అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, మే 17: పనిచేస్తున్న సంస్థకే టోకరా వేయడానికి ప్రయత్నించిన ఐదుగురు ఉద్యోగులను అరెస్టు చేసిన పంజాగుట్ట పోలీసులు వారిని రిమాండ్‌కు తరలించారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పశ్చిమ మండలం డిసిపి వెంకటేశ్వర రావు, ఏసిపి వెంకటేశ్వర్లు కేసు వివరాలను వెల్లడించారు. జిడిమెట్లకు చెందిన దుర్గాప్రసాద్ అలియాస్ నాని, చార్మినార్ యాకత్‌పురాకు చెందిన శ్రీనివాస్ చారి, మల్కాజ్‌గిరి చెందిన మోహన్ చారి, న్యూహఫీజ్ పేట్ కు చెందిన బ్రహ్మాజీ, కూకట్‌పల్లికి చెందిన రవికుమార్, రమణ అమీర్‌పేట్‌లోని జెఎస్ బ్రదర్స్ షోరూమ్‌లో బంగారు ఆభరణాల తయారీదారులుగా విధులు నిర్వహిస్తున్నారు.
బంగారు ఆభరణాల తయారీ క్రమంలో వీరు అతికొద్దిపాటి బంగారాన్ని తీసుకొని అంతేమొత్తంలో వెండిని కలుపుతూ ఆభరణాలను తయారు చేస్తున్నారు. షోరూమ్ వారు ఆభరణాల నాణ్యతా పరీక్షలు నిర్వహించగా నాణ్యతలో లోపం కనిపించింది. సుమారు అర కిలో వరకు బంగారం తేడా వచ్చింది. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు గోల్డ్‌స్మిత్ పనులు చేస్తున్న ఐదుగుర్నీ అదుపులోనికి తీసుకొని విచారించగా తమ తప్పు ఒప్పుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 40 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. కాగా ఇదే కేసుతో సంబంధం ఉన్న రమణను అరెస్టు చేయాల్సి ఉందని పోలీసులు తెలిపారు.