హైదరాబాద్

‘అరుణాచల రమణీయము’ గ్రంథావిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ, మే 17: ఆచార్య అనుమాండ్ల భూమయ్య రచించిన ‘అరుణాచల రమణీయము’ గ్రంథావిష్కరణ సభ కినె్నర ఆర్ట్ థియేటర్స్, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం చిక్కడపల్లి గానసభలోని కళాసుబ్బారావు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ఆచార్య కాసుఖేల రాఘవేంద్ర విశే్వశ్వరరావు పాల్గొని గ్రంథావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరుణాచల విశిష్టతను అనుమాండ్ల భూమయ్య పుస్తకంలో ఎంతో అద్భుతంగా పొందుపరిచారని తెలిపారు. సామాన్య మానవులకు అర్థమయ్యే భాషలో రచన చేశారని పేర్కొన్నారు. అనుమాండ్ల భూమయ్య రచించిన గ్రంథాలు ఎంతో పేరు సంపాదించాయని తెలిపారు.
మద్దాళి బాలసరస్వతి తొలి ప్రతి స్వీకరించారు. ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణ సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో ఆధ్యాత్మిక వక్త విఎస్‌ఆర్.మూర్తి, గానసభ అధ్యక్షుడు కళావేంకట దీక్షితులు, సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు డా.ఆర్.ప్రభాకరరావు, మద్దాళి రఘురామ్ పాల్గొన్నారు.